S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

01/07/2016 - 12:11

కర్నూలు:రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగను ఉత్సాహభరితంగా జరపాలని, వివిధ పోటీలను కూడా ఏర్పాటు చేయాలని సి.ఎం. చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం ఆయన అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ జరిపిన సందర్భంగా వంటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించాలని సూచించారు.

01/07/2016 - 12:10

కర్నూలు: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు ఎ.పి. సి.ఎం. చంద్రబాబు హామీ ఇచ్చారని రాష్ట్ర ఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు. ఆయన గురువారం ఉదయం ఇక్కడ చంద్రబాబును కలిసి ఉద్యోగుల సమస్యలపై వివరించారు. ఉద్యోగులకు డిఏ, హెల్త్‌కార్డులు, కాంట్రాక్టు సిబ్బంది క్రమబద్దీకరణపై రెండు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని సి.ఎం. హామీ ఇచ్చారన్నారు.

01/07/2016 - 12:09

గుంటూరు: క్రోసూరు మండలం గుడిపూడిలో బుధవారం అర్ధరాత్రి రామారావు, వెంకాయమ్మ అనే వృద్ధ దంపతులను దుండగులు కత్తులతో గొంతుకోసి హతమార్చారు. గురువారం ఉదయం ఈ సంఘటన వెలుగుచూశాక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

01/07/2016 - 12:07

కాకినాడ: ఇక్కడి కలెక్టర్ కార్యాలయంలోని ఓ గదిలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో కంప్యూటర్లు, ఫర్నిచర్ దగ్ధమయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేశారు.

01/06/2016 - 18:20

కర్నూలు: ఓర్వకల్లులో ఎడ్యుకేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తామని, పేదల ఆదాయం పెరిగేలా ఉపాధి కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం గోస్పాడు మండలం దీబగుంట్లలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో 100 శాతం మరుగుదొడ్లు నిర్మిస్తామని..అర్హులందరికీ దీపం గ్యాస్‌ కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు.

01/06/2016 - 13:35

అనంతపురం: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నారని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. నగరంలోని రహ్మత్‌నగర్, గార్లదిన్నెలో బుధవారం జన్మభూమి సభల్లో పాల్గొన్నారు. విభజన తర్వాత రాష్ట్రం లోటు బడ్జట్‌లో ఉందన్నారు.

01/06/2016 - 13:20

గుంటూరు : సీఆర్డీఏ పరిధిలో మూడు వేల కిలోమీటర్ల మేరకు రోడ్ల నిర్మాణం చేపడతామని ఏపీ మంత్రి నారాయణ వెల్లడించారు. ఆయన బుధవారంనాడు స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో జరిగిన రాజధాని మాస్టర్ ప్లాన్‌పై అవగాహన సదస్సులో మాట్లాడుతూ రైతులు అంగీకరిస్తేనే గ్రామాల మధ్య రోడ్లు వేస్తామని వెల్లడించారు. ఈ సదస్సులో 29 గ్రామాల రైతులు పాల్గొన్నారు.

01/06/2016 - 13:20

అనంతపురం : అనంతపురం నగరంలోని ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. హాస్టల్ సమస్యలు పరిష్కరించాలని, మెరుగైన భోజనం అందించాలని విద్యార్థులు భోజనం ప్లేట్లతో ర్యాలీ నిర్వహించారు.

01/06/2016 - 13:19

ఒంగోలు : ప్రకాశం జిల్లా చినగంజాంలో దారుణం చోటుచేసుకుంది. భాగ్యనగర్ కాలనీలో శివ అనే ఐదేళ్ల బాలుడికి పెంపుడు తల్లి వాతలు పెట్టింది. స్థానికుల ఫిర్యాదుతో చైల్డ్‌లైన్ సభ్యులు స్పందించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

01/06/2016 - 11:44

గుంటూరు: గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో చంద్రన్న దళం పేరుతో మావోయిస్టులు పోస్టర్లు మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంటించారు. అక్రమంగా వ్యాపారాలు చేసే వారిని వదిలిపెట్టేది లేదని మావోలు హెచ్చరించారు. దీంతో పల్నాడు ప్రాంతంలో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.

Pages