ఆంధ్రప్రదేశ్‌

నకిలీ పత్రాలతో స్మగ్లర్లకు బెయిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫోర్జరీ సంతకాలతో సర్ట్ఫికెట్లు తయారీ * బద్వేలులో నలుగురికి అరదండాలు

కడప, డిసెంబర్ 31: కడప సెంట్రల్ జైల్లో నెలలతరబడి మగ్గుతున్న అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లను బెయిల్‌పై విడిపించేందుకు పలువురు నేతలు, అధికారులు కోట్లరూపాయల్లో ఒప్పందం చేసుకుని నకిలీ పత్రాలను తయారుచేస్తున్నట్లు తాజాగా వెల్లడైంది. సుప్రీం కోర్టు నిబంధన మేరకు బెయిల్‌పై విడుదలకావాలంటే స్థానికంగా ఉన్న వారే జామీన్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నిబంధన మేరకు అంతర్జాతీయ స్మగ్లర్లకు బెయిల్ ఇప్పించేందుకు ఒప్పందం చేసుకున్న పలువురు నాయకులు, కొంతమంది అధికారులు కలిసి కమలాపురం, వల్లూరు తదితర ప్రాంతాల్లో ఎంపిడివోలు, గ్రామకార్యదర్శులచే జామీను ఇచ్చే వారికి ఇళ్లు ఉన్నట్లు నకిలీ సర్ట్ఫికెట్లు సృష్టించారు. ఆ సర్ట్ఫికెట్ల ద్వారా అంతర్జాతీయ స్మగ్లర్ బదానియా కోసం రెండురోజుల క్రితం బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. బదానియా కేసు బద్వేలు న్యాయస్థానం పరిధిలో ఉండటంతో బద్వేలులో బదానియాకు గంగాధర్, వెంకటేశ్వరరెడ్డి, రాజేంద్రప్రసాద్, మహేశ్వరరెడ్డి అనే వారు తమకు ఇళ్లు ఉన్నాయని, తద్వారా బదానియాకు బెయిల్ ఇవ్వాల్సిందిగా నకిలీపత్రాలతో బద్వేలు న్యాయస్థానానికి సమర్పించారు. న్యాయమూర్తికి అనుమానం వచ్చి బుధవారం ఈ విషయమై విచారించాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. బద్వేలు సిఐ రామాంజనాయక్, మైదుకూరు డిఎస్పీ రామకృష్ణయ్యలు ఈ వ్యవహారంపై విచారించగా వారు సమర్పించినవి నకిలీవని తేలడంతో వారిని అరెస్టు చేశారు. వారిని ప్రశ్నించగా తామే స్వయంగా సాల్వెన్సీ సర్ట్ఫికెట్లు తయారుచేసుకుని ఎంపిడివోలు, గ్రామకార్యదర్శుల సంతకాలు కూడా ఫోర్జరీ చేసినట్లు ఒప్పుకున్నారు. వారిని అరెస్టుచేసి న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి వారిని రిమాండ్‌కు పంపారు. అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు దాదాపు 200 మంది కడప సెంట్రల్ జైల్లో బెయిల్‌కోసం ఎదురుచూస్తున్నారు. వారిని విడిపించేందుకు ఇదే తరహాలో పలువురు నేతలు, అధికారులు పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకుని అంతర్జాతీయ స్మగ్లర్లను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే దాదాపు 400మంది పైబడి ఎర్రకూలీలు కూడా బెయిల్‌కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన వారైతే వారి కుటుంబ సభ్యులు బెయిల్ ఇచ్చి తీసుకెళ్తున్నారు. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, హర్యాన, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మద్యప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాలతోపాటు వివిధ దేశాలకు చెందిన స్మగ్లర్లకు బెయిల్ ఇప్పించేందుకు పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బద్వేలులో నకిలీ బెయిల్ రాకెట్ బట్టబయలుకావడంతో మిగిలిన ప్రాంతాల్లో ప్రయత్నాలు చేసే వారు తాత్కాలికంగా తమ ప్రయత్నాలు వాయిదావేసుకున్నట్లు తెలుస్తోంది. న్యాయస్థానాన్ని కూడా మోసగించి బెయిల్ ఇచ్చే వారి వెనుక నాయకులే కాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్‌తో సంబంధం ఉన్న బడాబాబులు కూడా ఉన్నట్లుతెలుస్తోంది.