ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమిలో పాల్గొని ఊరు రుణం తీర్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిఎం చంద్రబాబు నూతన సంవత్సర శుభాకాంక్షలు
విజయవాడ, డిసెంబర్ 31: నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రతి సంవత్సరం నిత్య నూతనమేనని, ప్రతిరోజు, ప్రతి నిమిషం విలువైనవేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో, దేశ విదేశాల్లో నివసిస్తున్న తెలుగువారంతా సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జీవించాలన్నదే తమ అభిమతమని, ఇందుకు సకల సదుపాయాలతో కూడిన గ్రామాలు ఏర్పడాలని, ఈ దిశగానే ‘స్మార్టు విలేజి / స్మార్టు వార్డు’ కార్యక్రమం చేపట్టామన్నారు. జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ దాకా నిర్వహించే మూడో విడత ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం అంశాన్ని ప్రాధాన్యతాంశంగా తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. పుట్టిన గడ్డతో ప్రతి ఒక్కరికీ అనుబంధం ఉంటుందని, వారు తమ స్వగ్రామాన్ని లేదా వార్డును దత్తత తీసుకుని నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఇప్పటికే గ్రామాలను, వార్డులను దత్తత తీసుకున్న ప్రముఖులను గ్రామసభల్లో పరిచయం చేస్తామని, వారు చేపట్టిన, చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలను వారు వివరిస్తారని చెప్పారు. ఆర్ధిక లోటు ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నామని, కేంద్ర సహకారంతో రాష్ట్ర విభజన నాటి హామీలను ఒక్కొక్కటిగా అమలుజరిగేలా చూస్తున్నామని తెలిపారు.