S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/01/2016 - 06:48

విజయవాడ (బెంజిసర్కిల్), మే 31: రాజకీయాలు మనుషులను, ప్రాంతాలను విడగొడితే, భాష ఒక్కటే అందరినీ కలుపుతుందని ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ నారా లోకేశ్ పేర్కొన్నారు. తెలుగు భాషా ప్రాబల్యం తగ్గుతున్న తరణంలో రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.

06/01/2016 - 06:41

గుంటూరు, మే 31: రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో దేవాదాయ భూములు కోల్పోయిన కౌలురైతులకు కూడా ప్రభుత్వం కౌలు చెల్లింపుతో పాటు, భూ సమీకరణ ప్యాకేజీని అమలుచేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద ఈ విషయమై కౌలురైతులు ధర్నా నిర్వహించారు.

,
06/01/2016 - 06:39

కర్నూలు, మే 31 : సిద్ధేశ్వరం అలుగు సాధన కోసం రైతులు కదం తొక్కారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నీరుగార్చాలన్న లక్ష్యంతో పోలీసు బలగాలను ఉపయోగించినా ఫలితం లేకపోయింది.

06/01/2016 - 06:30

విజయవాడ, మే 31: దశాబ్దాల తరబడి వడ్డీ వ్యాపారాలు జరుగుతుండటం చూశాం కానీ కాల్‌మనీ ముసుగులో మహిళలపై వేధింపులే గాక అరాచకాలు, అకృత్యాలకు పాల్పడుతున్న కాల్‌మనీ దందాను కూకటివేళ్లతో పెకిలించాలి.. బాధితులకు అన్ని వర్గాలు బాసటగా నిలవాలి..

06/01/2016 - 06:30

అనంతపురం, మే 31 : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఐదవ విడతగా బుధవారం నుంచి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. అందులో భాగంగా తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించి ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు.

06/01/2016 - 06:15

గుంటూరు, మే 31: రాజ్యసభకు అభ్యర్థిగా పరిశీలనలో ఉంచి చివరి క్షణంలో తనను తప్పించడంతో మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ అధిష్ఠానంపై అలక వహించారు. అధినేతతో తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా అంకితభావంతో పనిచేశానని, సీనియర్లకు సైతం పార్టీలో గుర్తింపు ఇవ్వటంలేదని పుష్పరాజ్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది.

06/01/2016 - 06:12

కడప, మే 31 : టాస్క్ఫోర్స్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ఏమాత్రం కళ్లెం వేయలేదనే చెప్పవచ్చు. దేశంలోనే అరుదైన అత్యంత విలువైన ఎర్రచందనం దుంగలను కడప జిల్లా శేషాచలం అడవి నుంచి స్మగ్లర్లు యథేచ్ఛగా తరలిస్తున్నారు. రెండు దశాబ్దాల కాలంగా జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో 25వేల ఎకరాల్లో రూ. 35వేల కోట్ల విలువచేసే ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలించినట్లు తెలుస్తోంది.

06/01/2016 - 06:11

విశాఖపట్నం, మే 31: రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర ప్రదేశ్‌లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురియవచ్చని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. ఒడిశా వరకూ అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని, దక్షిణ దిశగా తేమతో కూడిన గాలుల కారణంగా ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు.

06/01/2016 - 06:10

కనిగిరి రూరల్, మే 31: కట్టుకున్నవాడే కాలయముడుగా మారాడు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్య, ఇద్దరు కన్నబిడ్డలపై ఏమాత్రం మానవత్వం లేకుండా వారి మెడలకు తాడుతో ఉరి బిగించి చంపేశాడు. ఈ సంఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ పరిధిలోని చింతలపాలెంలో చోటుచేసుకుంది. స్థానిక సిఐ యు సుధాకర్‌రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

06/01/2016 - 06:10

ఒంగోలు, మే 31: విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఎంఎల్‌సి సోము వీర్రాజు వెల్లడించారు. మంగళవారం ఆయన ఒంగోలులో విలేఖర్లతో మాట్లాడుతూ 2014వ సంవత్సరం వరకు అధికారంలో ఉన్న పార్లమెంటు సభ్యుల అసమర్ధత వల్లే విశాఖకు రైల్వే జోన్ రాలేదన్నారు.

Pages