ఆంధ్రప్రదేశ్‌

మాజీ మంత్రి పుష్పరాజ్ అలక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 31: రాజ్యసభకు అభ్యర్థిగా పరిశీలనలో ఉంచి చివరి క్షణంలో తనను తప్పించడంతో మాజీ మంత్రి జేఆర్ పుష్పరాజ్ అధిష్ఠానంపై అలక వహించారు. అధినేతతో తాడోపేడో తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకున్నా అంకితభావంతో పనిచేశానని, సీనియర్లకు సైతం పార్టీలో గుర్తింపు ఇవ్వటంలేదని పుష్పరాజ్ తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీనివల్ల ప్రజల్లోకి వ్యతిరేక సంకేతాలు వెళ్తాయని అంటున్నారు. ఎస్సీ వర్గానికి చెందిన పుష్పరాజ్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. రాజ్యసభకు జిల్లా నుంచి ఆయనతో పాటు కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్లు తెరపైకి వచ్చాయి. మహానాడు సందర్భంగా అధినేత పుష్పరాజ్ పేరును ఖరారుచేసే అంశాన్ని కూడా నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే చివరి క్షణంలో ఆయన్ను కాదని పక్కన పెట్టడంతో పుష్పరాజ్ వర్గీయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. నిజాయితీగా పార్టీకి పనిచేసిన వారికే గుర్తింపు లేకపోతే ఇక భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో అనేది చర్చనీయాంశంగా మారింది. ఎస్సీల పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి పదవుల పంపకాల్లో మొండి చేయి చూపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో టిడిపిలోని సీనియర్లు తమ రాజకీయ భవితవ్యంపై సూత్రీకరణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పుష్పరాజ్ తన అనుచరులతో సమావేశమై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలియవచ్చింది. త్వరలో కార్యాచరణను కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పార్టీవర్గాల సమాచారం. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పుష్పరాజ్‌కు ఫోన్ చేసి బుజ్జగించినట్లు తెలిసింది. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఉంటాయని అన్నట్టు తెలిసింది.