ఆంధ్రప్రదేశ్‌

నేటి నుంచి జగన్ రైతు భరోసా యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 31 : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపి రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఐదవ విడతగా బుధవారం నుంచి అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్ర చేపట్టనున్నారు. అందులో భాగంగా తాడిపత్రి, కదిరి నియోజకవర్గాల్లో పర్యటించి ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను జగన్ పరామర్శించనున్నారు. తొలిరోజు ఆయన అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డికి కంచుకోట అయిన పెద్దవడుగూరు మండల పరిధిలోని దిమ్మగుడి గ్రామం నుంచి యాత్రను ప్రారంభించనున్నారు. రాజ్యసభకు అభ్యర్థుల ఎంపిక, నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడం, వైకాపా అభ్యర్థిగా విజయసాయిరెడ్డిని బరిలో నిలపడం పూర్తయిన నేపథ్యంలో జగన్ ముందస్తు ప్రణాళిక మేరకు రైతు భరోసా యాత్ర ఖరారైంది. కాంగ్రెస్ పార్టీలో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఉండి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడిగా, అనంతపురం జిల్లాలో తనదైన శైలిలో రాజకీయ నేతగా జెసి దివాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. వైఎస్ మరణానంతరం ఆయన గత ఎన్నికల్లో టిడిపిలోకి ఫిరాయించి అనంతపురం ఎంపిగా పోటీ చేసి గెలుపొందారు. అలాగే ఆయన తనయుడు జెసి ప్రభాకరరెడ్డిని తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. వైఎస్ మరణానంతరం ఆవిర్భవించిన వైకాపా గత ఎన్నికల్లో జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. అనంతపురం, హిందూపురం ఎంపి స్థానాలు సైతం టిడిపి వశమయ్యాయి.