ఆంధ్రప్రదేశ్‌

రైల్వే జోన్ ఖాయం: సోము వీర్రాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 31: విశాఖపట్నంలో రైల్వేజోన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ఎంఎల్‌సి సోము వీర్రాజు వెల్లడించారు. మంగళవారం ఆయన ఒంగోలులో విలేఖర్లతో మాట్లాడుతూ 2014వ సంవత్సరం వరకు అధికారంలో ఉన్న పార్లమెంటు సభ్యుల అసమర్ధత వల్లే విశాఖకు రైల్వే జోన్ రాలేదన్నారు. విశాఖకు రైల్వే జోన్ వచ్చేందుకు కొన్ని సమస్యలు ఉన్నాయని, ఆ సమస్యలను అధిగమించి జోన్ తెచ్చేందుకు కేంద్రం ముందుకు వెళ్తుందన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావుకు భారతరత్న ఇవ్వాల్సిందేనని అన్నారు. రెండు సంవత్సరాల పాలనలో బిజెపి విజయాలను ప్రజలకు వివరించేందుకు కేంద్ర నాయకత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రెండు వందల బహిరంగసభలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బిజెపి శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు వెల్లడించారు. ఈ సభల్లో కేంద్ర మంత్రులతోపాటు బిజెపి ముఖ్యనాయకులు పాల్గొంటారని అన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో సభలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈనెల నాలుగు, ఐదు తేదీల్లో రాజమండ్రి, కాకినాడలో బహిరంగసభలు ఏర్పాటు చేశామన్నారు. ఈనెల 17వ తేదీన విశాఖలో జరిగే సభకు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా హాజరౌతారని ఆయన తెలిపారు.