S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/31/2016 - 13:23

హైదరాబాద్: ఎపి నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడం తనకెంతో సంతోషం కలిగిస్తోందని కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభు అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, ఎపి సిఎం చంద్రబాబు మంచి నాయకుడన్నారు. రాష్ట్రం అభివృద్ధికి తన సాయశక్తులా మద్దతు ఇస్తానని ఆయన ప్రకటించారు.

05/31/2016 - 13:23

హైదరాబాద్: ఎపి నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్న కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు మంగళవారం అసెంబ్లీ భవనంలో రిటర్నింగ్ అధికారి ఎదుట తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ నామినేషన్ పత్రాలపై ఎపి సిఎం చంద్రబాబు సంతకం చేయడం విశేషం. ముంబయికి చెందిన సురేష్ ప్రభును ఎపి నుంచి రాజ్యసభ ఎన్నికలకు బిజెపి అధిష్ఠానం ఎంపిక చేయడం తెలిసిందే.

05/31/2016 - 13:22

హైదరాబాద్: టిడిపి, బిజెపిల మధ్య పొత్తు ఇకపై మరింత పటిష్టమవుతుందని తెలుగుదేశం యువనేత నారా లోకేష్ మంగళవారం ఇక్కడ మీడియాతో అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎపి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. కేంద్ర రైల్వేమంత్రి సురేష్ ప్రభును ఎపి నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడం మంచి పరిణామమని, ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందన్నారు.

05/31/2016 - 11:40

కర్నూలు: ఆదోని మండలం సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మాణానికి వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన రైతులను మంగళవారం ఉదయం పోలీసులు అడ్డుకున్నారు. కొత్తపల్లి, ఆత్మకూరు, సంగమేశ్వరం, సిద్ధేశ్వరం తదితర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించినప్పటికీ రైతులు అలుగు శంకుస్థాపనకు బయలుదేరారు. విపక్షాలకు చెందిన కొంతమందిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

05/31/2016 - 11:39

హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న కేంద్రమంత్రి సుజనా చౌదరి, మాజీ మంత్రి టిజి వెంకటేష్ మంగళవారం ఎపి అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారి సమక్షంలో తమ నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ నుంచి వీరు ర్యాలీగా బయలుదేరి అసెంబ్లీకి చేరుకున్నారు. మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఇతర నాయకులు, అభిమానులు ర్యాలీలో పాల్గొన్నారు.

05/31/2016 - 11:39

హైదరాబాద్: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు వైకాపా అధినేత జూన్ 1 నుంచి అయిదు రోజుల పాటు రైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. బుధవారం ఆయన అనంతపురం జిల్లా కదిరి, తాడిపత్రి ప్రాంతాల్లో పర్యటించి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఓదారుస్తారు.

05/31/2016 - 11:38

హైదరాబాద్: రాజ్యసభకు అభ్యర్థుల ఎంపిక పార్టీలో ఏకాభిప్రాయంతోనే సాధ్యమైందని ఎపి ప్రభుత్వవిప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. వివిధ సామాజిక వర్గాలకు న్యాయం చేసే సంప్రదాయాన్ని టిడిపి అనాదిగా పాటిస్తోందన్నారు.

05/31/2016 - 11:37

హైదరాబాద్: రాజ్యసభకు అభ్యర్థుల ఎంపికపై టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సంతృప్తికరంగానే ఉందని ఎంపి జెసి దివాకరరెడ్డి అన్నారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభును ఎపి నుంచి రాజ్యసభకు పంపడం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. విశాఖ రైల్వే జోన్ గురించి ఇపుడే మాట్లాడడం సముచితం కాదన్నారు. సురేష్ ప్రభు వల్ల భవిష్యత్‌లో రైల్వేశాఖ పరంగా ఎపి ఆకాంక్షలు నెరవేరే అవకాశం ఉందన్నారు.

05/31/2016 - 07:35

విజయవాడ, మే 30: ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిన టిడిపి ప్రభుత్వ విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం సేకరించి, ఆ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస సమన్వయ కమిటీ తీర్మానించిందని పిసిసి అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి తెలిపారు.

05/31/2016 - 07:19

తిరుపతి, మే 30: ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అనే చెప్పే పురాణ పండితుల పట్ల టిటిడి సైతం అధర్మంగా ప్రవర్తించడం దారుణమని బాలాజీ పురాణ పండితుల యూనియన్ గౌరవ అధ్యక్షుడు కందారపు మురళి విమర్శించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌లో పని చేస్తున్న పురాణ పండితులు సోమవారం టిటిడి పరిపాలనా భవనం ఎదుట పురాణ ప్రవచనంతో నిరసన చేపట్టారు.

Pages