S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/30/2016 - 06:40

తిరుపతి, మే 29: తిరుపతి మహానాడు మూడు రోజుల ముచ్చట ఆదివారంతో ముగిసింది. యథావిధిగా చంద్రబాబునాయుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలపై వస్తున్న అవినీతి ఆరోపణలను దృష్టిలో ఉంచుకుని.. దానిని మరో మార్గం పట్టించేందుకు జగన్ అవినీతిని మరోసారి తెరపైకి తీసుకువచ్చారు.

05/30/2016 - 06:37

కాకినాడ, మే 29: పప్పు ధాన్యాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు, మినపప్పు ధరలు అమాంతం పెరిగిపోవడంతో జనం హడలెత్తిపోతున్నారు. హోటళ్లు, తినుబండారాల దుకాణదారులు కూడా ధరలు పెంచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కంది, మినప్పప్పులు బ్లాక్‌మార్కెటీర్లు స్టాక్ చేసినట్టు స్పష్టమవుతోంది. అయినప్పటికీ సదరు గోదాములపై దాడులకు అధికారులు సాహసించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.

05/29/2016 - 20:02

హైదరాబాద్:తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని, భవిష్యత్‌లో బిజెపికే భవిష్యత్ ఉందని, 2019 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. బిజెఎల్‌పి నేతగా ఎన్నికైన కిషన్‌రెడ్డి పార్టీ సమావేశంలో మాట్లాడారు. ఎంఐఎం ఎదిగితే దేశానికి నష్టమని వ్యాఖ్యానించిన కిషన్‌రెడ్డి పార్టీ పటిష్టతకు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు.

05/29/2016 - 17:32

తిరుపతి:రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని, అందుకోసం తెలుగుదేశం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. తిరుపతిలో మహానాడు మూడోరోజు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇప్పటివరకు 28 తీర్మానాలకు ఆమోదం లభించిందని, వెయ్యిమంది వలంటీర్లు, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి మహానాడును దిగ్విజయం చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.

05/29/2016 - 17:32

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌కు త్వరలో కొత్త అధ్యక్షుడిని నియమిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేస్తామని, మిత్రపక్షంగా కొనసాగుతామని చెప్పిన ఆయన ప్రత్యేకహోదా అంశం పరిశీలిస్తున్నామన్నారు.

05/29/2016 - 16:37

తిరుపతి:ప్రజస్వామ్య రాజకీయాలలో ఎప్పటికప్పుడు మార్పులు సహజమని, అవి అభివృద్ధికి సహకరిస్తాయని తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆర్థిక మంత్రి యనమనల రామకృష్ణుడు అన్నారు. మహానాడులో రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అలాంటి మార్పు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మొదలైందని అన్నారు.

05/29/2016 - 16:36

తిరుపతి:విభజన అనంతరం సమస్యల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని నెమ్మదిగా అభివృద్ధి చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి పార్టీ శ్రేణులు సంపూర్ణ సహకారం అందిస్తున్నాయని, తాను సీఎం కొడుకునే అయినప్పటికీ పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం లేదని, అవినీతికి పాల్పడటం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. అదే వైఎస్ హయాంలో ఆయన తనయుడు జగన్ ఏం చేశారో ప్రజలకు తెలుసునని అన్నారు.

05/29/2016 - 16:35

విశాఖపట్నం:సముథ్రతీరంలో ఆనందంగా గడపటానికి వెళ్లిన ఓ కుటుంబం విషాదంలో ములిగిపోయింది. పాపతో సరదాగా గడుపుతున్న దంపతుల్లో భర్త తినుబండారాలు కొనేందుకు గట్టుపైకి వెళ్లినపుడు ఫోన్ రావడంతో భార్య ఓ పక్కకు వెళ్లి మాట్లాడుతూండగా మూడేళ్ల పాప సముద్రపు అలలవైపు వెళ్లి నీట కొట్టుకుపోయింది. స్థానిక అల్లిపురం గాంధీబొమ్మ ప్రాంతానికి చెందిన శేఖర్ దంపతులకు చెందిన మూడేళ్ల పాప సముద్రపు అలల్లో కొట్టుకుపోయింది.

05/29/2016 - 04:52

తిరుపతి, మే 28: తిరుపతిలో జరుగుతున్న టిడిపి మహానాడులో రెండో రోజైన శనివారం 11 తీర్మానాలను ఆమోదించారు.

05/29/2016 - 04:47

సోంపేట/ యాడికి, మే 28: రాష్ట్రంలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందార. అనంతపురం జిల్లాలో ఇద్దరు, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బేసిరామచంద్రాపురం జాతీయరహదారి కూడలి వద్ద శనివారం వేకువజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు.

Pages