S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/29/2016 - 04:23

హైదరాబాద్, మే 28: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను గత రెండేళ్లలో నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఆయనపై జూన్ 2వ తేదీన రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో చీటింగ్ కేసు నమోదు చేయనున్నట్లు వైకాపా ప్రకటించింది.

05/29/2016 - 04:21

హైదరాబాద్, మే 28: మైనార్టీల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుని ఆయా వర్గాల ఉన్నతికి తోడ్పడాలని రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు.

05/29/2016 - 04:20

హైదరాబాద్, మే 28: పోషకాహార లోపం విభిన్న రూపాల్లో వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుండగా, సమస్యను అధిగమించేందుకు సమాజంలోని అన్ని వర్గాల నుండి సహకారం తప్పనిసరని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా యునిసెఫ్ చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పారు.

05/29/2016 - 04:16

విజయవాడ, మే 28: రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొనబడిన అంశాలన్నింటినీ దశలవారీగా నెరవేర్చే దశలో కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం వివిధ పద్దుల కింద భారీగా నిధులను కేటాయించడమే గాక కేవలం గడచిన రెండేళ్లలో ముందెన్నడూ లేని విధంగా ఒక లక్షా 43వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేయటం జరిగిందని వీటిలో అత్యధికం ఇప్పటికే కార్యరూపం దాల్చాయని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ

05/29/2016 - 04:15

రాజమహేంద్రవరం, మే 28: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మర్యాదపూర్వక కృతజ్ఞతా పర్యటన కొనసాగుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్రంలోపల జరిగిన ఈ పర్యటన..ఇప్పుడు హైదరాబాద్‌లో మొదలైంది. ముద్రగడ వారం రోజులపాటు హైదరాబాద్‌లోనే మకాం ఉండి పలువురు నేతలను మర్యాదపూర్వకంగా కలిసి తన ఉద్యమానికి నైతిక బలాన్నిచ్చినందుకు, సంఘీభావం ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలియజేసే పనిలో నిమగ్నమయ్యారు.

05/29/2016 - 04:14

గుంటూరు, మే 28: ముద్రగడ పద్మనాభం శనివారం హైదరాబాద్‌లో చిరంజీవి, దాసరిని కలవడంపై పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ కావాలంటే మంజునాథ కమిషన్ ముందు వాదనలు వినిపించాలే తప్ప ఇలా చిరంజీవి, దాసరిని కలిసి ఉపయోగం లేదన్నారు. శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ మేరకు మంత్రి నారాయణ స్పందించారు.

05/29/2016 - 04:12

అనంతపురం సిటీ, మే 28 : ఆంధ్రప్రదేశ్ లా సెట్-2016 యుజి, పిజి ప్రవేశ పరీక్షలకు 12,368 మంది హాజరైనట్లు లా-సెట్ రాష్ట్ర కన్వీనర్ పుల్లారెడ్డి తెలిపారు. అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయలు యూనివర్శిటీ ఆవరణలో ఉన్న లాసెట్ కార్యాలయంలో శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన లా సెట్-2016 పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

05/29/2016 - 04:11

మామిడికుదురు, మే 28: కంటికిరెప్పలా కాపాడవలసిన తండ్రే కూతుర్ని లైంగిక కాటువేసాడు.తండ్రి ఒడిగట్టిన అఘాయిత్యాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామానికి చెందిన గెడ్డం ప్రసాదరావు భార్య గల్ఫ్‌లో ఉంటోంది. తాగుడికి బానిసైన ప్రసాదరావు కన్న కూతురుపై అత్యాచారం చేశాడు.

05/29/2016 - 04:10

విశాఖపట్నం, మే 28: కోస్తాంధ్రలో శనివారం ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. కొన్ని చోట్ల వర్షపాతం నమోదు అయినట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఆదివారం కూడా చాలా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలిపారు. బాపట్లలో 41 డిగ్రీలు, నెల్లూరు 41.3, మచిలీపట్నంలో 33.6, తునిలో 32.6, కళింగపట్నంలో 36.6, గన్నవరంలో 37.6 డిగ్రీలు నమోదైంది.

05/29/2016 - 04:09

నెల్లూరు/ఒంగోలు, మే 28: నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో శనివారం ఉదయం కొద్దిసెకెన్లపాటు భూమి కంపించింది. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, వరికుంటపాడు, కలిగిరి, వింజమూరు, ఎఎస్‌పేట, చేజర్ల, సంగం మండలాల్లో, ప్రకాశం జిల్లా కనిగిరి, పామూరు, లింగ సముద్రం మండలాల్లో భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో భూ ప్రకంపనలకు గోడలు బీటలు వారాయి.

Pages