S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/30/2016 - 14:59

విజయవాడ: వ్యక్తిగత లాభం కోసమే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపులను రెచ్చగొడుతున్నారని ఎపి మున్సిపల్ మంత్రి నారాయణ ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లపై గతంలో విజయభాస్కర రెడ్డి జారీ చేసిన జీవోను అమలు చేయాలని కోరుతున్న ముద్రగడ తెలుగుదేశం ఎంపీగా ఉన్నపుడు నోరు మెదపలేదన్నారు. కాపులకు రిజర్వేషన్లను అమలు చేయడం చంద్రబాబుకు తప్ప మరెవరికీ సాధ్యం కాదని నారాయణ అన్నారు.

05/30/2016 - 14:58

విజయవాడ: ఇక్కడికి సమీపంలోని మూలపాడు వద్ద అధునాతనంగా నిర్మించిన రెండు క్రికెట్ మైదానాలను బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోమవారం ప్రారంభించారు. 13 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 7 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఈ మైదానాలను తీర్చిదిద్దారు. మంత్రి దేవినేని ఉమ, ఎంపీలు కేశినేని నాని, గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

05/30/2016 - 14:57

కాకినాడ: అధికారులు ఇంటి స్థలాన్ని రద్దు చేశారని తెలియడంతో పిఠాపురంలోని జగ్గయ్యచెరువు ప్రాంతంలో సోమవారం దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. భర్త తీవ్రంగా గాయపడగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. నిరుపేదలకు ఇళ్లస్థలాలను రద్దు చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

05/30/2016 - 11:55

విజయవాడ: ఎపి నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం ఇక్కడ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. నాలుగో సీటుకు కూడా పోటీ చేసే విషయమై ఆయన పలువురి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఎపి టిడిపి అధ్యక్షడు కళావెంకట్రావు, ఆర్థికమంత్రి యనమల, కేంద్రమంత్రులు అశోక్‌గజపతి రాజు, సుజనాచౌదరిలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు.

05/30/2016 - 11:54

అనంతపురం: అనంతపురం జిల్లా ధర్మవరంలో చేనేత వ్యాపారి రామాంజనేయులును కొందరు దుండగులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. మూడు లక్షల రూపాయలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేయడంతో పోలీసులు దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

05/30/2016 - 11:53

విజయవాడ: రాష్ట్రం నుంచి ఎన్నికలు జరిగే నాలుగు రాజ్యసభ స్థానాలకూ తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావు సోమవారం ఇక్కడ మీడియాకు స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం పార్టీ అధినేత చంద్రబాబుదేనని పాలిట్‌బ్యూరో సమావేశంలో ఇదివరకే తీర్మానించామన్నారు. ఈరోజు సాయంత్రానికి అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

05/30/2016 - 08:02

తిరుపతి, మే 29: తిరుపతిలో జరుగుతున్న మహానాడులో తమ జన్మదినోత్సవాలను జరుపుకోవడం అదృష్టమని, ఈ అవకాశం కొందరికే లభించిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం మహానాడు సభలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, మోదుగుల, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తమ జన్మదినోత్సవాలను జరుపుకున్నారు. మహానాడు వేదికపైన చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి జన్మదినోత్సవాలు జరుపుకున్న వారికి తినిపించారు.

05/30/2016 - 08:01

తిరుపతి, మే 29: శ్రీ వేంకటేశ్వరుని పాదాల చెంత మూడు రోజులపాటు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతం అయ్యిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.

05/30/2016 - 07:04

తిరుపతి, మే 29: తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు చివరిరోజైన ఆదివారంనాడు పార్టీ జాతీయ కార్యదర్శి, ఆంధ్ర సిఎం చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్, పార్టీ తెలంగాణ నేతలు తెలంగాణరాష్ట్ర సమితిపైనా, తెలంగాణ సిఎం కె.చంద్రశేఖర్ రావుపైనా నిప్పులు చెరిగారు.

05/30/2016 - 06:46

తిరుపతి, మే 29: ‘పేదరికం నా కులం.. నా మతం. పేదరికం ఎక్కడుంటే నేను అక్కడుంటా. పేదరిక నిర్మూలనే నా లక్ష్యం, సంకల్పం’ అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు రోజులపాటు సాగిన టిడిపి మహానాడు ముగింపు సభలో ఆయన గంటకు పైగా ఉద్వేగంగా ప్రసంగించారు. కాంగ్రెస్, వైకాపాలపై విమర్శలతో విరుచుకుపడ్డ బాబు కెసిఆర్‌పై పెదవి విప్పకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

Pages