ఆంధ్రప్రదేశ్‌

పేదరికమే నా కులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 29: ‘పేదరికం నా కులం.. నా మతం. పేదరికం ఎక్కడుంటే నేను అక్కడుంటా. పేదరిక నిర్మూలనే నా లక్ష్యం, సంకల్పం’ అని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మూడు రోజులపాటు సాగిన టిడిపి మహానాడు ముగింపు సభలో ఆయన గంటకు పైగా ఉద్వేగంగా ప్రసంగించారు. కాంగ్రెస్, వైకాపాలపై విమర్శలతో విరుచుకుపడ్డ బాబు కెసిఆర్‌పై పెదవి విప్పకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్న విషయాన్ని వివరించారు. విదేశాల నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వివిధ పరిశ్రమలు ఎలా ముందుకు వస్తున్నాయో వివరించారు. జల వనరుల కోసం పోరాడుతున్న తీరు, నదులు అనుసంధానం ఇక ఇంకుడు గుంతలు ద్వారా భూగర్భ జలాలను పెంచడం, పంట సంజీవిని ఆలోచనతో వ్యవసాయ రంగంలో వస్తున్న సత్ఫలితాలను వివరించారు. నిధుల కొరత లేకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్నదే తన ఆశయమన్నారు. 2050 సంవత్సరం వరకు టిడిపి అధికారంలో ఉండి తీరాలని, ఆ దిశగా నాయకులు ప్రజలకు సేవలు అందించాలన్నారు. ఈ రాష్ట్రంలో ఎన్నో పార్టీలు, జెండాలు వచ్చాయనీ, జెండాలు పీకేశారని, పార్టీలు కనుమరుగయ్యాయని ఎద్దేవా చేశారు. ఆర్థిక నేరాలతో కూడుకున్న వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి కనుమరుగవడం ఖామమని, పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం తథ్యమన్నారు. అవినీతిపరులు, నేరస్థులను ప్రజలు ఆమోదించడం లేదని ఇప్పటికే అనేక సందర్భాలు మనకు తెలిసిందేనన్నారు. అందుకే టిడిపిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు నీతి, నియమాలతో ప్రజలకు అంకితభావంతో సేవలు అందించి పార్టీని సుదీర్ఘకాలం అధికారంలో ఉండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు అండగా ఉంటే బుల్లెట్‌లా కాకుండా రాకెట్‌లా దూసుకుపోతానని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ఉద్వేగంగా అన్నారు. అధికారం ఉన్నచోట ప్రజల సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రతిపక్షంలో ఉన్నచోట ప్రజా సమస్యల పరిష్కారానికి రాజీలేని పోరాటం చేస్తున్నామని ఇదే తెలుగుదేశం పార్టీ నిబద్ధత అన్నారు. భవిష్యత్తులో నిలిచేది ఒక్క టిడిపి మాత్రమేనని అన్నారు. తెలంగాణలో పోరాట స్ఫూర్తిని ప్రదర్శిస్తున్న కార్యకర్తలందరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీని బతికించుకోవడం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన త్యాగధనులకు ధన్యవాదాలు చెప్పిన చంద్రబాబు నాయుడు పార్టీలో ఏ కార్యకర్త మరణించినా కుటుంబ సభ్యుల్లో ఒకరు దూరమైనంతగా బాధపడ్డామని అన్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళి తనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన కార్యకర్తలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. మహానాయకుడు ఎన్‌టిఆర్ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం నిర్మించాలని ఆదేశించారని ఆయన ఆశయ సాధనకు అంకితభావంతో పని చేస్తానని బాబు అన్నారు. తనకు అధికారం ముఖ్యం కాదని, ప్రజల గుండెల్లో చెరగని స్థానం కావాలని అన్నారు. 35 సంవత్సరాలుగా పార్టీ జెండా మోసిన కార్యకర్తలను తాను ఆదుకుంటానని మహానాడు సభలో సిఎం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గృహకల్ప పేరుతో పేదలకు కట్టించిన ఇళ్లలోకి పేదలు వెళ్లడానికి కూడా సిద్ధపడని పరిస్థితి ఉందన్నారు. అలాకాకుండా 6 లక్షల మందికి అవసరమైన పక్కాగృహాలను నిర్మించి ఇవ్వడానికి టిడిపి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ మహానాడు తనకెంతో తృప్తిని ఇచ్చిందని, మీ ఉత్సాహాన్ని చూసి తనలో మరింత ఆత్మస్థైర్యం పెరిగిందని బాబు అన్నారు. ఇప్పటివరకు జరిగిన మహానాడులో తిరుపతిలో జరిగిన మహానాడు గొప్పగా జరిగిందన్నారు. నిర్వాహకులు కూడా మహానాడు విజయవంతానికి గొప్పగా కృషి చేశారని, వీరిని పేరుపేరున అభినందిస్తున్నాని అన్నారు. ఎన్‌టి రామారావుఏపిలో ప్రాజెక్టుల నిర్మాణానికి తలపెట్టిన కార్యక్రమాన్ని తాను పూర్తి చేయడానికి కృషి చేస్తున్నానని సిఎం చంద్రబాబు అన్నారు. ఏపిని కరవురహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమని తెలిపారు. ఈ పరిస్థితిలో అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో మొక్కలు నాటే కార్యక్రమంలో కార్యకర్తలు చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
chitram...
జల వనరుల పరిరక్షణపై మహానాడు వేదిక మీద పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రమాణం చేయస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు