S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/01/2016 - 06:09

హైదరాబాద్, మే 31: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 16వ తేదీ నుండి నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల టైమ్‌టేబుల్‌ను రాష్ట్ర పరీక్షల బోర్డు మంగళవారం నాడు విడుదల చేసింది. పరీక్షలు ఉదయం 9.30 నుండి 12.30 వరకూ జరుగుతాయని డైరెక్టర్ ఎం ఆర్ ప్రసన్నకుమార్ చెప్పారు.

06/01/2016 - 06:08

హైదరాబాద్, మే 31: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించడం ద్వారానే మరింత మెరుగైన విద్యను విద్యార్ధులకు అందించడం సాధ్యమవుతుందని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన సచివాలయంలో తన చాంబర్‌లో ఉన్నత విద్యపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలతోనే విద్యార్థులకు ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు.

06/01/2016 - 06:07

విశాఖపట్నం, మే 31: తీరంలో తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. తీరంలో సందర్శకులు మృత్యువాత పడుతున్న సంఘటనలను నియంత్రించేందుకు వీలుగా పటిష్ఠమైన చర్యలు చేపట్టేందుకు పోలీస్, మెరైన్ పోలీస్, కోస్ట్‌గార్డ్, మత్స్యశాఖ, నౌకాదళం ప్రతినిధులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు.

06/01/2016 - 06:07

హైదరాబాద్, మే 31: పోర్టుల అభివృద్ధికి విస్తృ త అవకాశాలు ఉన్నాయని, జర్మనీ సహా పలు దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిశోర్‌బాబు చెప్పారు. ఐదు రోజుల పర్యటనకు జర్మనీ వెళ్లిన మంత్రి జర్మనీ హాంబర్గ్‌పోర్టును సందర్శించారు.

05/31/2016 - 18:06

అనంతపురం: తిరుమలలో బ్రోకర్ల రాజ్యం కొనసాగుతోందని, టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు వైఖరే ఇందుకు కారణమని ధర్మవరం ఎమ్మెల్యే సూర్యనారాయణ ఆరోపించారు. బ్రోకర్లకు ఇరవై వేలు చెల్లిస్తే బ్రేక్ దర్శనాలకు అనుమతి ఇస్తున్నారన్నారు. జెఇఓ ధోరణిపై హైకోర్టులో కేసు వేస్తామని, సిఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

05/31/2016 - 18:05

విజయవాడ: నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళ మరణించగా ఆమె బంధువులు ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. కాగా, మహిళ మృతికి కారకుడైన వైద్యుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

05/31/2016 - 15:56

విజయవాడ: మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో ఎసిబి అధికారులు మంగళవారం సోదాలు చేశారు. ఓ వ్యక్తి నుంచి పదివేల రూపాయలు తీసుకుంటున్న జూనియర్ అసిస్టెంట్‌ను ఎసిబి అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు.

05/31/2016 - 15:55

గుంటూరు: వినుకొండలో కొద్దిరోజుల క్రితం బషీరున్ అనే మహిళ ఆత్మహత్యకు సంబంధించి ఆమె ఇద్దరు కొడుకులు, కోడళ్లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇంట్లో వేధింపులు తాళలేక బషీరున్ ఎత్తయిన భవనం నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.

05/31/2016 - 14:07

అనంతపురం: నకిలీ డీడీలతో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినందుకు అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి షాకీర్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధిస్తూ సిబిఐ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో కె.వెంకట ప్రసాద్ అనే టిడిపి నాయకుడికి ఏడేళ్ల జైలు, 6 లక్షల జరిమానా విధించారు.

05/31/2016 - 13:24

రాజమండ్రి: జంటహత్యల కేసులో యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఠాగూర్ అనే ఖైదీ మంగళవారం ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జైలులో కలకలం రేపింది. నల్గొండ జిల్లాకు చెందిన ఠాగూర్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Pages