ఆంధ్రప్రదేశ్‌

ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాలు పాటించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించడం ద్వారానే మరింత మెరుగైన విద్యను విద్యార్ధులకు అందించడం సాధ్యమవుతుందని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ఆయన సచివాలయంలో తన చాంబర్‌లో ఉన్నత విద్యపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలతోనే విద్యార్థులకు ఎక్కువగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. రాష్ట్భ్రావృద్ధికి ఉన్నత విద్యారంగం అత్యంత కీలకమని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించగలమని అన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తయారుచేయాలంటే నాణ్యమైన విద్యకు ఎపి కేరాఫ్ అడ్రస్‌గా ఉండాలని అన్నారు.
నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీలను ఏరివేసేందుకు తీసుకోవలసిన చర్యలపై మంత్రి అధికారులతో చర్చించారు. ఎఐసిటిఇ నిబంధనలు పాటించని కాలేజీలపై ప్రధానంగా చర్చ జరిగింది. నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీల్లో తనిఖీలకు విజిలెన్స్, పోలీసుల ప్రమేయం లేకుండానే విద్యా నిపుణులతోనే కమిటీలు వేస్తే మంచిదని మంత్రి చెప్పారు. ఈ మేరకు అధికారులు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఎపి ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీలో జెఎన్‌టియు అనంతపురానికి చెందిన ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి, ప్రొఫెసర్ సుదర్శన్‌రావు, జెఎన్‌టియుకె కు చెందిన ప్రొఫెసర్ పద్మరాజు, సాంకేతిక విద్యాశాఖ తరఫున విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్ శేషగిరిరావులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీల్లో ర్యాండమ్ పద్ధతిలో 40 కాలేజీల్లో ఈ కమిటీ తనిఖీలు చేపట్టనుంది. ఎఐసిటిఇ నిబంధనలకు అనుగుణంగా టీచింగ్ ఫ్యాకల్టీ ఉందా లేదా అని చూడటంతో పాటు అదే అధ్యాపకుడు వేరే కాలేజీల్లో కూడా పనిచేస్తున్నారా అన్నది పరిశీలిస్తారు. అలాగే ఎఎఫ్‌ఆర్‌సికి ఇచ్చిన డేటా పునర్విచారణ చేపడుతుంది. పరిపాలనా పరమైన ఖర్చులపై అందించిన వివరాలను కూడా ఆరా తీస్తుంది. సమీక్షా సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మి, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఎంటెక్ ఫీజులు ఖరారు
ఆంధ్రప్రదేశ్‌లో ఎంటెక్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. 55వేల రూపాయిలు మొదలు గరిష్టంగా లక్ష రూపాయిల వరకూ నిర్ధారించారు. రానున్న మూడేళ్లు ఈ ఫీజులు అమలులో ఉంటాయి. ఎఐసిటిఇ అనుమతించిన 229 కాలేజీల్లో ఫీజుల జాబితాను ప్రభుత్వం ఖరారు చేసింది. విఆర్ సిద్ధార్ధ కాలేజీలో ఎంటెక్ కోర్సు ఫీజు లక్ష రూపాయిలు ఉంటుంది. 91వేల వరకూ ఫీజు ఉన్నవి మూడు, 80వేల రూపాయిలు ఫీజు ఉన్నవి 13, 57వేలు ఫీజు ఉన్నవి 157 కాలేజీలు ఉన్నాయి. కొద్ది కాలేజీల్లో మాత్రం ఫీజు 55వేలుగా నిర్ధారించారు. ఫీజులు పెంచాలని ఎంటెక్ కాలేజీల నుండి పెద్దగా డిమాండ్ రాకపోవడం గమనార్హం.
సిఎం చేతులు మీదుగా నియామక ఉత్తర్వులు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులు మీదుగా బుధవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో టీచర్లకు నియామక ఉత్తర్వులు అందిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.