ఆంధ్రప్రదేశ్‌

తీరంలో ప్రమాదాల నివారణకు కార్యాచరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 31: తీరంలో తరచూ చోటుచేసుకుంటున్న ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. తీరంలో సందర్శకులు మృత్యువాత పడుతున్న సంఘటనలను నియంత్రించేందుకు వీలుగా పటిష్ఠమైన చర్యలు చేపట్టేందుకు పోలీస్, మెరైన్ పోలీస్, కోస్ట్‌గార్డ్, మత్స్యశాఖ, నౌకాదళం ప్రతినిధులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. గడచిన దశాబ్ద కాలంలో ఒక్క విశాఖ సాగరతీరంలో చోటుచేసుకున్న ప్రమాదాల్లో 465 మంది మృత్యువాత పడ్డారంటే ఇక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. సందర్శకులను విశేషంగా ఆకర్షించే విశాఖ ఆర్‌కె బీచ్, రుషికొండ బీచ్‌ల్లో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. విశాఖ బీచ్‌లో ప్రమాద కరమైన పరిస్థితులు ఉన్నాయన్న వాస్తవాన్ని ఎప్పటికప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ సందర్శకులు హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. అయితే ఈ విషయంలో యంత్రాగం నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసినట్టే ఇక్కడ కూడా సేఫ్టీ కౌన్సిల్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తీరంలో ప్రమాదాలను నియంత్రించేందుకు వీలుగా ప్రభుత్వ విభాగాలతో కమిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. తూర్పునౌకాదళం, జివిఎంసి, పోలీస్, మెరైన్ పోలీస్, కోస్ట్‌గార్డ్స్, మత్స్యశాఖ, పర్యాటక శాఖ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, తదితర విభాగాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.