ఆంధ్రప్రదేశ్‌

కన్న కూతురుపై అఘాయత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామిడికుదురు, మే 28: కంటికిరెప్పలా కాపాడవలసిన తండ్రే కూతుర్ని లైంగిక కాటువేసాడు.తండ్రి ఒడిగట్టిన అఘాయిత్యాన్ని ఎవరికీ చెప్పుకోలేక ఆ మైనర్ బాలిక గర్భం దాల్చింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామానికి చెందిన గెడ్డం ప్రసాదరావు భార్య గల్ఫ్‌లో ఉంటోంది. తాగుడికి బానిసైన ప్రసాదరావు కన్న కూతురుపై అత్యాచారం చేశాడు. టెన్త్ చదువుతున్న కూతురిని గత సంవత్సర కాలంగా శారీరకంగా అనుభవిస్తున్నాడు. ఆరు నెలల గర్భవతి అని తేలడంతో కూతురికి అబార్షన్ చేయించేందుకు ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. తండ్రి తీసుకువచ్చాడు కాబట్టి వైద్యులు కూడా అబార్షన్ చేసారు. అప్పటికే తీవ్ర రక్తస్రావం జరగడంతో ప్రాణనష్ట నివారణకు అబార్షన్ చేయవలసి వచ్చిందని వైద్యులు పేర్కొంటున్నారు. నాలుగు రోజుల క్రితం తండ్రి పాల్పడుతున్న అఘాయిత్యాన్ని గల్ఫ్‌లో ఉంటున్న తల్లికి చెప్పింది. దీంతో స్వగ్రామం చేరుకున్న తల్లి నగరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన బయటకు తెలిసింది. దీంతో నగరం ఎస్‌ఐ జి వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.