ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం, నెల్లూరుల్లో స్వల్ప భూప్రకంపనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/ఒంగోలు, మే 28: నెల్లూరు,ప్రకాశం జిల్లాల్లో శనివారం ఉదయం కొద్దిసెకెన్లపాటు భూమి కంపించింది. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు, వరికుంటపాడు, కలిగిరి, వింజమూరు, ఎఎస్‌పేట, చేజర్ల, సంగం మండలాల్లో, ప్రకాశం జిల్లా కనిగిరి, పామూరు, లింగ సముద్రం మండలాల్లో భూమి కంపించినట్టు స్థానికులు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో భూ ప్రకంపనలకు గోడలు బీటలు వారాయి. పెద్ద శబ్ధంతో భూమి కంపించడంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. శనివారం ఉదయం 9గంటల ప్రాంతంలో తిరిగి 11గంటల ప్రాంతంలో పెద్ద శబ్దంతో ఆరు సెకన్‌ల పాటు భూమి కంపించడంతో ఇళ్లల్లోని వారు భయపడి ఏమి జరుగుతుందోనని బయటకు వచ్చారు. అయితే వరికుంటపాడు మండలంలో నాలుగుగంటల వ్యవధిలో ఏడుసార్లు భూమికంపించినట్టు స్థానికులు చెప్పారు ప్రకాశం జిల్లా సిఎస్‌పురం, జరుగుమిల్లి, లింగసముద్రం, పామూరు మండలాల్లో ఉదయం 8.45- 9గంటల మధ్య రెండుసార్లు భూమి కంపించింది.