ఆంధ్రప్రదేశ్‌

దేవాదాయ కౌలు రైతుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 31: రాజధాని అమరావతి ప్రాంత పరిధిలో దేవాదాయ భూములు కోల్పోయిన కౌలురైతులకు కూడా ప్రభుత్వం కౌలు చెల్లింపుతో పాటు, భూ సమీకరణ ప్యాకేజీని అమలుచేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద ఈ విషయమై కౌలురైతులు ధర్నా నిర్వహించారు. మంగళగిరి, తుళ్లూరు, తాడేపల్లి మండలాల్లోని రాజధాని ప్రతిపాదిత 29 గ్రామాల్లో గత కొనే్నళ్లుగా దేవాదాయ భూములను కౌలుకు తీసుకుని ఎక్కువ మంది రైతులు జీవనం సాగిస్తున్నారు. భూ సమీకరణలో భాగంగా ప్రభుత్వం దేవస్థానం భూములను స్వాధీన పర్చుకోవడంతో కౌలురైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. రాజధానిలో అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న వారికి సైతం ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిందని సామాన్య, నిరుపేద వర్గాలకు చెందిన తమకు జీవనభృతి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. భూ సమీకరణ రైతులకు చెల్లించే ప్యాకేజీలో కనీసం 3వ వంతు తమకు వర్తింపజేసినా తమకు వెసులుబాటు కలుగుతుందని, ప్రభుత్వం ఈ దిశగా సమాలోచనలు జరపాలని కౌలు రైతులు విజ్ఞప్తి చేశారు. ఏటా క్రమం తప్పకుండా దేవాదాయశాఖకు కౌలు చెల్లిస్తున్నామని, భూములు కోల్పోవడంతో తమ కుటుంబాలు వీధినపడే ప్రమాదం ముంచుకొచ్చిందని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కౌలురైతుల సమస్యలు తీర్చకపోతే రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అల్టిమేటం జారీచేశారు. పెనుమాక, మందడం, ఎర్రబాలెం, తుళ్లూరు గ్రామాలకు చెందిన రైతులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

చిత్రం తుళ్లూరు సిఆర్‌డిఎ ఆఫీసు ఎదుట ధర్నా