ఆంధ్రప్రదేశ్‌

కదం తొక్కిన కర్షకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 31 : సిద్ధేశ్వరం అలుగు సాధన కోసం రైతులు కదం తొక్కారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నీరుగార్చాలన్న లక్ష్యంతో పోలీసు బలగాలను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. కర్నూలు జిల్లా కొత్తపల్లె మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సప్తనదుల సంగమేశ్వరం వద్ద మంగళవారం రాయలసీమ రైతు సంఘం, సిద్ధేశ్వరం అలుగు సాధన సమితి ఆధ్వర్యంలో సిద్ధేశ్వరం అలుగు కోసం చేపట్టిన శంకుస్థాపన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రాయలసీమ జిల్లాల నుంచి సుమారు 15వేల మంది రైతులు సంగమేశ్వరం వద్దకు చేరుకున్నారు. ఏ రాజకీయ పార్టీ అండ లేకపోయినా కేవలం రైతు సంఘాల పిలుపునకు స్పందించి రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. కాగా సంగమేశ్వరం వద్దకు వెళ్లేందుకున్న ఉన్న అన్ని దారుల్లో పోలీసులు మొహరించి ఎవరినీ అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సిద్ధేశ్వరం అలుగు సాధన కోసం గత 75 రోజులుగా రాయలసీమ రైతు సంఘం, సిద్ధేశ్వరం అలుగు సాధన సమితి ఆధ్వర్యంలో పెద్దఎత్తున శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా రాయలసీమలోని నాలుగు జిల్లాల రైతులకు విజ్ఞప్తి చేశారు. సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం పూర్తయితే రాయలసీమకు ఏర్పడే ప్రయోజనాల గురించి వారు రైతులకు వివరించారు. శంకుస్థాపన స్థలి సంగమేశ్వరంగా నిర్ణయించినా ప్రభుత్వ తీరును గుర్తించిన నాయకులు ఎక్కడ వీలైతే అక్కడే శంకుస్థాపన చేస్తామని ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. వ్యూహాత్మకంగా రైతులను సంగమేశ్వరం వద్దకు వెళ్లేందుకున్న అన్ని మార్గాల్లోనూ తరలించారు. ఈ కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్న భూమన్‌ను నందికొట్కూరులోని ఓ ప్రైవేట్ అతిథి గృహంలో పోలీసులు నిర్బంధించారు. స్థానిక ప్రతిపక్ష పార్టీ నేతలను సైతం ఇళ్ల నుంచి బయటకు రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులను తప్పించుకుని నంద్యాల నుంచి ఆత్మకూరు మీదుగా సంగమేశ్వరం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన బొజ్జా దశరథరామిరెడ్డిని ఎర్రమఠం గ్రామం వద్ద గుర్తించి అరెస్టు చేశారు.

చిత్రం సంగమేశ్వరం వద్ద మంగళవారం రాయలసీమ రైతు సంఘం, సిద్ధేశ్వరం అలుగు సాధన సమితి ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాన రైతులు
* సిద్ధేశ్వరం అలుగుకు శంకుస్థాపన చేస్తున్న దృశ్యం