ఆంధ్రప్రదేశ్‌

ఆగని ఎర్రచందనం స్మగ్లింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 31 : టాస్క్ఫోర్స్ పోలీసులు తీసుకుంటున్న చర్యలు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు ఏమాత్రం కళ్లెం వేయలేదనే చెప్పవచ్చు. దేశంలోనే అరుదైన అత్యంత విలువైన ఎర్రచందనం దుంగలను కడప జిల్లా శేషాచలం అడవి నుంచి స్మగ్లర్లు యథేచ్ఛగా తరలిస్తున్నారు. రెండు దశాబ్దాల కాలంగా జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతంలో 25వేల ఎకరాల్లో రూ. 35వేల కోట్ల విలువచేసే ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలించినట్లు తెలుస్తోంది. తాజాగా కడప జిల్లా శివారులోని శేషాచలం అటవీప్రాంతంలో మంగళవారం ఉదయం టాస్క్ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ నిర్వహిస్తుండగా 20మందికి పైగా స్మగ్లర్లు 25 దుంగలను వదిలి పారిపోయారు. టాస్క్ఫోర్స్ డిఐజిగా కాంతారావును శేషాచలం అడవులకు ప్రత్యేక అధికారిగా నియమించారు. ఏడాదికాలంగా కొందరు పోలీసు అధికారులు, పోలీసు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కుమ్మక్కు కావడంతోనే ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పూర్తిగా అడ్డుకట్టవేయలేకపోయామని డిఐజి సైతం పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో వారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తరపున అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఏకె ఫరీడ రాయలసీమ జిల్లాల పోలీసు, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులతో కడప స్టేట్ గెస్ట్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అటవీశాఖ యాక్టులో మార్పులు చేసి ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడితే పదేళ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల జరిమానా ఉంటుందని ప్రకటించారు. ఇక ఎర్రచందనం విస్తీర్ణం విషయానికొస్తే జిల్లాతో పాటు చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అరకొర ఎర్రచందనం సంపద ఉండగా కడప జిల్లాలోనే 70శాతం పైబడి ఎర్రచందనం శేషాచలం అడవుల్లో విస్తరించి ఉంది. 400 మంది టాస్క్ఫోర్స్, కొందరు సివిల్ పోలీసులు 7 జిల్లాల్లో నిఘా పెట్టినా స్మగ్లర్లు, కూలీలు రకరకాల వేషాలతో కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చి యథేచ్ఛగా శేషాచలం అడవులకు చేరుకుంటున్నారు. వారిలో చాలామంది గంధం చెక్కల అంతర్జాతీయ స్మగ్లర్ వీరప్పన్ వద్ద శిక్షణ పొందిన వారేనని తెలుస్తోంది.