ఆంధ్రప్రదేశ్‌

కోస్తాలో అక్కడక్కడా జల్లులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 31: రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర ప్రదేశ్‌లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురియవచ్చని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. ఒడిశా వరకూ అల్పపీడన ద్రోణి విస్తరించి ఉందని, దక్షిణ దిశగా తేమతో కూడిన గాలుల కారణంగా ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. దక్షిణ కోస్తాలో మాత్రం 40 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదు అవుతుందని తెలిపారు. క్యుములోనింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో సాధారణం కంటే గరిష్టంగా మూడు డిగ్రీలు అధికంగా నమోదైందని తెలిపారు. జంగమేశ్వరపేట, రామగుండంలో 43 డిగ్రీలు, గన్నవరం, నందిగామలో 42, నెల్లూరు, కావలి 41, అనంతపురం, విశాఖ విమానాశ్రయంలో 39 డిగ్రీలు నమోదైంది.