S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/15/2016 - 12:07

రాజమండ్రి: ఖరీఫ్‌లో 8.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని ధవళేశ్వరం ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ చెప్పారు. ఖరీఫ్‌కు సాగునీటిని అధికారులు విడుదల చేశారు. అంతకు ముందు ధవళేశ్వరం బ్యారేజ్‌ దగ్గర ఇరిగేషన్‌ అధికారులు పూజలు చేశారు.

06/15/2016 - 08:28

విజయవాడ, జూన్ 14: నిత్యం ప్రజలతో మమేకమై పనిచేసిన వారు ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తారని వైకాపా అధినేత జగన్ చెప్పారు. అందుకే గడపగడపకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఆయన తెలియచేశారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం ఇక్కడ జరిగింది. వచ్చే నెల ఎనిమిదో తేదీ నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుందని అన్నారు.

06/15/2016 - 08:24

విజయనగరం, జూన్ 14: బ్రాహ్మణ కులంవారితో స్వయం సహాయక సంఘాలను ఏర్పాటుచేసి ఈ సంఘాలకు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు.

06/15/2016 - 04:40

విజయవాడ, జూన్ 14: ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి చంద్రబాబు కరిచాడని, ఆయన చేయని మోసం లేదు,చెప్పని అబద్ధం లేదంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్వరంతో విరుచుకు పడ్డారు. అబద్దాలే చంద్రబాబును గద్దెనెక్కించాయని, ఆయన మాట్లాడేవి అబద్ధాలని తెలియక మోసపోయి ఓట్లు వేసిన రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు దారణంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

06/15/2016 - 04:36

విజయవాడ, జూన్ 14: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాధునికమైన పది డ్రోన్ (యుఎవీలు)లను సమకూర్చుకోబోతోంది. భద్రత, నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, ప్రకృతి విపత్తుల వంటి పరిస్థితుల్లో సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా డ్రోన్‌ల కొనుగోలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

06/15/2016 - 05:04

విజయవాడ, జూన్ 14: రాష్ట్రంలో సంక్షేమం కోసం ఖర్చుపెట్టే ప్రతి రూపాయిని ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలని, ఇందుకోసం ఒకే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడా అవకతవకలకు తావివ్వకుండా, లబ్ధిదారులు సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకునేలా చేయడం సాంకేతికతతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరుపై చంద్రబాబు మంగళవారం సిఎంఓలో సమీక్ష జరిపారు.

06/15/2016 - 04:28

హైదరాబాద్, జూన్ 14:తెలంగాణ రాష్ట్రం కోసం వివిధ వ్యూహాలు రచించి చివరకు అనుకున్నది సాధించిన ఉద్యమ నేతల ఎత్తుగడను కాపునేతలు అనుసరించనున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌పై ఎవరు విమర్శలు చేసినా, వారిపై తెలంగాణ ద్రోహుల ముద్ర వేయడం ద్వారా ప్రత్యర్ధులను కట్టడి చేసిన టీఆర్‌ఎస్ వ్యూహాన్ని, ఏపిలో కాపు నేతలు కూడా అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు.

06/15/2016 - 04:24

విజయవాడ, జూన్ 14:రూపాయికి ప్లేట్ ఇడ్లీ, మూడు రూపాయలకు పెరుగన్నం, ఐదు రూపాయలకు పులిహోర! రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ‘అన్న’ క్యాంటీన్లలో రేట్లు ఇవి. మంగళవారం సిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రులు పరిటాల సునీత, ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేయనున్న తొలి క్యాంటీన్‌ను రాజధాని వెలగపూడిలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని చెప్పారు.

06/15/2016 - 04:21

కాకినాడ, జూన్ 14: తుని దుర్ఘటనలో ఆందోళనకారులపై సిఐడి పెట్టిన కేసులన్నిటినీ ఉపసంహరించడంతోపాటు ఆగస్టు నెలాఖరులోగా కాపులను బిసిలుగా గుర్తిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేంతవరకు నిరాహార దీక్ష కొనసాగించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిర్ణయించుకున్నట్టు తెలిసింది.

06/14/2016 - 18:14

విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం తొలిదశలో తుళ్లూరు, వెలగపూడిలో రెండు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తుందని వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్‌కు ఈ క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను అప్పగిస్తామన్నారు. మిగతా ప్రాంతాల్లోనూ దశలవారీగా ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామన్నారు.

Pages