ఆంధ్రప్రదేశ్‌

సంక్షేమానికి సాంకేతిక పదును

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: రాష్ట్రంలో సంక్షేమం కోసం ఖర్చుపెట్టే ప్రతి రూపాయిని ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలని, ఇందుకోసం ఒకే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఎక్కడా అవకతవకలకు తావివ్వకుండా, లబ్ధిదారులు సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకునేలా చేయడం సాంకేతికతతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరుపై చంద్రబాబు మంగళవారం సిఎంఓలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బయోమెట్రిక్ హాజరు విధానం, ఇ-హాస్టళ్లు, జియోట్యాగింగ్‌ను నూరు శాతం పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. స్మార్ట్ పల్స్ సర్వేతో సంక్షేమ కార్యక్రమాలను మరింత మెరుగ్గా ప్రజల్లోకి తీసుకువెళ్లచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న రేషన్, పింఛన్, బీమాతో సామాన్యులు సంతోషంగా ఉన్నారని, సమాజంలో 80 శాతం మందికి సంక్షేమ ఫలాలు అందించాలన్నది తన లక్ష్యమని చెప్పారు. ఈ ఏడాది 30 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇస్తామని పేర్కొన్న ఆయన ఇందుకు వీలుగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుతో విద్యా ప్రమాణాలు పెంచేలా అధికారులు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థులతో పాటు కాపు, బ్రాహ్మణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. వివిధ కార్పొరేషన్‌ల ద్వారానే ఇచ్చే వ్యక్తిగత,గ్రూప్ రుణాలు సక్రమంగా వినియోగమయ్యేలా అధికారులు చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల వినియోగాన్ని ఒకే వేదిక ద్వారా పర్యవేక్షించాలని మంత్రి కిషోర్ బాబును ఆదేశించారు. వచ్చే నెలాఖరు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2,276 బయోమెట్రిక్ పరికరాలను అమర్చే ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.

చిత్రం... సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు