ఆంధ్రప్రదేశ్‌

ఇక డ్రోన్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యాధునికమైన పది డ్రోన్ (యుఎవీలు)లను సమకూర్చుకోబోతోంది. భద్రత, నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, ప్రకృతి విపత్తుల వంటి పరిస్థితుల్లో సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా డ్రోన్‌ల కొనుగోలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డ్రోన్‌ల పనితీరును, అన్ని రకాల పరిస్థితుల్లోనూ వాటిని ఉపయోగించుకునే విధానాన్ని పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని డిజిపి జెవి రాయుడు తెలిపారు. వివిధ రకాల ఉద్యమాల తీరుతెన్నులను పరిశీలించడానికి, స్మగ్లింగ్ తదితర కార్యకలాపాలను అరికట్టేందుకూ ఈ డ్రోన్‌లు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ డ్రోన్ కెమేరాలు రాష్ట్ర మంతటా ఏర్పాటు చేస్తామని, నేర నియంత్రణ మొదలుకుని ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం వరకూ అన్ని సమయాల్లో వీటిని ఉపయోగించుకునే వీలుంటుందని తెలిపారు. అలాగే వ్యవసాయ, నీటి నిర్వహణ, పంటల పరిశీలన వంటి వాటికీ ఈ డ్రోన్‌ల వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని వెల్లడించారు. పోలీసులకు సంబంధించినంత వరకూ నేరగాళ్లు ఎక్కడ ఉన్నా గుర్తించడానికి ఇవి తోడ్పడతాయని రాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ డ్రోన్‌లలో హై రిసొల్యూషన్, ఇన్‌ఫ్రారెడ్, ధర్మల్ కెమేరాలను ఏర్పాటు చేస్తామని, వీటి వల్ల నేరస్తులను గుర్తించడం సులభ సాధ్యమవుతుందని వెల్లడించారు.