S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/17/2016 - 07:35

కాకినాడ, జూన్ 16: తుని ఘటనలో అరెస్టయ్యి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్న నిందితుల్లో నలుగురు గురువారం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కూరాకుల పుల్లయ్య అలియాస్ బుజ్జి అలియాస్ దొరబాబు, పల్లా సత్తిబాబు, తిక్కపల్లి సత్యనారాయణ, లగుడు శ్రీనివాసరావు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మెజిస్ట్రేట్ కోర్టులో బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇవి శుక్రవారం బెంచ్‌పైకి రానున్నట్టు తెలిసింది.

06/17/2016 - 07:35

మారేడుమిల్లి, జూన్ 16: కొన్ని రకాల వ్యాధుల నిరోధానికి చిన్నారులకు అందించే వాక్సిన్ వికటించి తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో అయిదు నెలల ఆడ శిశువు మృత్యువాత పడగా, మరో ఇరువురు బాలురు ప్రమాదకర పరిస్థితుల్లో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలావున్నాయి.

06/16/2016 - 18:14

విశాఖ: ప్రేమ విఫలం కావడంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గొలుగొండ మండలం కొత్తమల్లమ్మపేటలో గురువారం జరిగింది. కొయ్యూరు మండలం గంటారం గ్రామానికి చెందిన చింతకాయల సతీష్ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే, ప్రేమ విఫలం కావడంతో చింతచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి దుస్తుల్లో లభించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

06/16/2016 - 18:13

గుంటూరు: అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 12 లక్షల రూపాయల విలువ చేసే హైబ్రీడ్ మిర్చి విత్తనాలను విజిలెన్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్‌లోని ఓ గోడౌన్‌లో ఈ నిల్వలను దాచిఉంచినట్లు అధికారులు కనుగొన్నారు.

06/16/2016 - 18:12

విజయనగరం: పంటపొలంలో పిడుగు పడడంతో ఏడు ఆవులు మరణించిన ఘటన కొమరాడ మండలం చుక్కవలసలో గురువారం జరిగింది. పాడి ఆవులు మరణించడంతో రైతులు విషాదంలో మునిగిపోయారు.

06/16/2016 - 15:55

విశాఖ: అనుమానాస్పద స్థితిలో పాడేరు ఎఎస్పీ శశికుమార్ మరణించడం పట్ల ఎపి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఎఎస్పీ మరణించినట్లు తెలిసిన వెంటనే ఇతర కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హోం మంత్రి హుటాహుటిన విశాఖ చేరుకున్నారు. కింగ్‌జార్జి ఆస్పత్రిలో శశికుమార్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

06/16/2016 - 15:53

హైదరాబాద్: కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనకు వైకాపా అధినేత జగన్ గురువారం బ్రిటన్ వెళుతున్నారు. పదిరోజుల తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. బ్రిటన్ వెళుతున్నందున ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన వాయిదా పడింది.

06/16/2016 - 15:52

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి పోలీసులు అరెస్టు చేసిన నిందితుల తరఫున పిఠాపురం కోర్టులో గురువారం బెయిల్ పిటిషన్‌ను న్యాయవాదులు దాఖలు చేశారు. దీనిపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

06/16/2016 - 15:51

కర్నూలు: పది కేసుల్లో నిందితుడైన మావోయిస్టు పార్టీ నాయకుడు గజ్జెల కృష్ణారెడ్డి గురువారం నాడు రాయలసీమ ఐజి ఎదుట లొంగిపోయారు. ఆయనపై పోలీసు శాఖ గతంలోనే 4 లక్షల రివార్డు ప్రకటించింది. రాడికల్ స్టూడెంట్ యూనియన్‌లో కార్యకర్తగా చేరి కృష్ణారెడ్డి మావోయిస్టు పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు.

06/16/2016 - 12:47

ఒంగోలు: రక్తం కారేలా విద్యార్థిపై చేయి చేసుకున్న ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని తల్లిదండ్రులు ఆందోళన ప్రారంభించిన ఘటన ప్రకాశం జిల్లాలో గురువారం జరిగింది. సంతమాగలూరు మండలం కొమ్మాలపాడులోని ఉర్దూ పాఠశాలలో సురేష్ అనే ఉపాధ్యాయుడు విద్యార్థి నహీన్‌ను విచక్షణారహితంగా కొట్టాడు. విద్యార్థులను కొట్టినందుకు సురేష్‌ను గతంలో ఓసారి అధికారులు సస్పెండ్ చేశారు.

Pages