S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/17/2016 - 18:28

విశాఖ: గుర్తింపు లేదన్న సాకుతో ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడం సరికాదని బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అన్నారు. పాఠశాలలు తెరిచాక విద్యాశాఖ అధికారులకు నిబంధనలు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు.

06/17/2016 - 18:28

హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు పల్లంరాజు ఇంట్లో శుక్రవారం కాపు నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి, దాసరి నారాయణరావు, సి.రామచంద్రయ్య, వైకాపా నేత బొత్స సత్యనారాయణ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు కల్పించేలా సిఎం చంద్రబాబు చర్యలు తీసుకోవాలని వీరు విజ్ఞప్తి చేశారు.

06/17/2016 - 18:27

విశాఖ: పాడేరు ఎఎస్పీ శశికుమార్ అనుమానాస్పద మృతిపై సమీక్షించేందుకు ఎపి డిజిపి జెవి రాముడు శుక్రవారం ఇక్కడికి వచ్చారు. విశాఖ రేంజ్ డిఐజి శ్రీకాంత్, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ యోగానంద్‌లతో కలిసి ఆయన ఎఎస్పీ మృతిపై పూర్వపరాలను సమీక్షించారు. ఎఎస్పీ మృతిపై సిఎం చంద్రబాబు సిబిసిఐడి విచారణకు ఆదేశించడంతో డిజిపి ఈ సమీక్ష జరిపారు.

06/17/2016 - 18:26

కాకినాడ: తుని వద్ద కాపుగర్జన సందర్భంగా జరిగిన విధ్వంసకాండలో పోలీసులు అరెస్టు చేసిన నలుగురు నిందితులకు బెయిల్ మంజూరైంది. పిఠాపురంలోని అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి గాయత్రి శుక్రవారం నాడు వీరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.

06/17/2016 - 17:22

విశాఖ: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాగల 48 గంటల్లో ఉత్తరాంధ్రతో పాటు ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల్లో కదలిక వచ్చి రెండు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

06/17/2016 - 16:40

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో జనాభా తగ్గుతోందని, ముఖ్యంగా సంపన్నవర్గాల వారు ఒక బిడ్డతో సరిపెట్టుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన శుక్రవారం ఇక్కడ చిన్నారులకు పౌష్టికాహారం అనే అంశంపై జరిగిన సభలో మాట్లాడారు. పిల్లలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు అమృతహస్తం పథకాన్ని తాము గతంలోనే ప్రారంభించామన్నారు. పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అన్ని వర్గాల వారూ దృష్టిసారించాలన్నారు.

06/17/2016 - 16:38

విజయవాడ: వడ్డీతో కలిపి పదికోట్ల రూపాయల బకాయిలను ఏళ్లతరబడి చెల్లించక పోవడంతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు (ఐఓబి) అధికారులు కంచికిచర్లలోని హాలిడే ఇన్ రెస్టారెంట్‌ను శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ రెస్టారెంట్ యాజమాన్యానికి 2006లో మూడు కోట్ల రూపాయల రుణాన్ని ఐఓబి ఇచ్చింది. వడ్డీతో కలిపి బకాయిల మొత్తం పది కోట్లకు మించడంతో చివరకు రెస్టారెంటును స్వాధీనం చేసుకున్నారు.

06/17/2016 - 16:36

ఒంగోలు: రెండు కుటుంబాల మధ్య స్థల వివాదం ఘర్షణగా మారడంతో 9 మంది గాయపడిన సంఘటన బల్లికురవ మండలం వల్లపల్లిలో శుక్రవారం జరిగింది. రెండు కుటుంబాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అద్దంకి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

06/17/2016 - 16:34

విశాఖ: ‘నా మరణానికి ఏ అధికారి, ఎవరూ బాధ్యులు కారు.. మూడు నెలలుగా విధి నిర్వహణలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నా..’- అని రాసిన సూసైడ్ నోట్‌ను సిబిసిఐడి పోలీసులు పాడేరు ఎఎస్పీ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్నారు. ఎఎస్పీ శశికుమార్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తు ప్రారంభించిన సిఐడి పోలీసులు శుక్రవారం ఆయన కార్యాలయంలో క్షుణ్ణంగా సోదాలు చేశారు.

06/17/2016 - 15:16

విశాఖపట్నం: ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొస్తాంధ్రలో పలుచోట్ల వర్షాలు, ఉత్తరకోస్తాలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

Pages