ఆంధ్రప్రదేశ్‌

వ్యాక్సిన్ వికటించి శిశువు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, జూన్ 16: కొన్ని రకాల వ్యాధుల నిరోధానికి చిన్నారులకు అందించే వాక్సిన్ వికటించి తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో అయిదు నెలల ఆడ శిశువు మృత్యువాత పడగా, మరో ఇరువురు బాలురు ప్రమాదకర పరిస్థితుల్లో కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలావున్నాయి. ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి మండలం సున్నంపాడు పంచాయతీ పెదమల్లంపాడు గ్రామానికి చెందిన మడకం శ్రీనివాసు దొర, లక్ష్మీ దంపతులు తమ అయిదు నెలల చిన్నారికి బుధవారం మధ్యాహ్నం ఎఎన్‌ఎం దుర్గతో పెంటావాలెట్ రోటా వైరస్ వాక్సిన్ వేయించారు. అనంతరం వారు కాలినడకన తమ స్వగ్రామం పెదమల్లంపాడు చేరుకునే సరికి పాప తీవ్ర అస్వస్థతకు గురై విరోచనాలతో మృతిచెందింది. వాక్సిన్ వేయించుకున్న అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు బాలురు కూడా అస్వస్థతకు గురికావడంతో గ్రామస్థులు వారిని దేవరపల్లి వరకు తీసుకొచ్చి, 108కు సమాచారం అందించారు. రంపచోడవరం తీసుకెళ్లిన తరువాత బాలుర పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అక్కడి నుండి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.