S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/19/2016 - 08:52

ప్రత్తిపాడు/రాయవరం, జూన్ 18: తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో నలుగురు, మండల కేంద్రం రాయవరంలో ఇద్దరు మృతి చెందారు. ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై జోడుగడ్ల వాగు వద్దకు కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు.

06/19/2016 - 08:13

రాజమహేంద్రవరం, జూన్ 18: కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో కలిసి గత వారం రోజులుగా రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాలలో దీక్ష చేస్తున్న పద్మనాభం కుమారుడు ము ద్రగడ గిరి, కోడలు సిరి శనివారం రాత్రి 10గంటలకు దీక్ష విరమించారు. ఈ సందర్భంగా గిరి, సిరితోపాటు ముద్రగడ వియ్యంకుడు శివాజీ విలేఖర్లతో మాట్లాడుతూ వైద్యుల సూచనల మేరకు దీక్ష విరమించినట్టు తెలిపారు.

06/19/2016 - 08:10

హైదరాబాద్, జూన్ 18: ఆంధ్రా ఆర్టీసి ఆర్థిక స్థితిగతులపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తరహాలో ఏపి ప్రభుత్వం కూడా ఆర్టీసిలో అధికారులతో విసృత స్ధాయి సమావేశం నిర్వహించాలని ఏపిఎస్‌ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ ఉప ప్రధాన కార్యదర్శి వి దామోదరరావు డిమాండ్ చేశారు.

06/19/2016 - 08:10

హైదరాబాద్, జూన్ 18: ఆంధ్రప్రదేశ్‌లో భర్తీ చేయబోతున్న 10వేల పోస్టులపై రాష్ట్రప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వివిధ శాఖల్లో ఏయే కేటగిరి పోస్టులను భర్తీ చేయబోతున్నదీ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కు, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుకు సమాచారం ఇచ్చింది. ఇప్పటికే పోస్టుల రోస్టర్‌ను సిద్ధం చేసిన అధికారులు వారం రోజుల్లో నోటిఫికేషన్లు జారీ చేయనున్నారని తెలిసింది.

06/19/2016 - 08:09

మచిలీపట్నం, జూన్ 18: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శనివారం రాత్రి బాంబు కలకలం సృష్టించింది. కర్ణాటక ముఖ్యమంత్రి, గవర్నర్‌కు లీగల్ అడ్వైజర్‌గా భావిస్తున్న వికాస్ భాను సోడే అమ్మమ్మ చలమలశెట్టి సంజీవమ్మ స్వస్థలం మచిలీపట్నం. ఈమె మాచవరంలో నివశిస్తోంది. గత మూడు నెలల నుండి వికాస్ భాను సోడే ప్రతినెలా మూడో శనివారం తన అమ్మమ్మ ఇంటి పక్కనున్న ఆంజనేయస్వామి గుడిలో పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.

06/19/2016 - 08:07

హైదరాబాద్, జూన్ 18: వైద్య సీట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి అన్యాయం జరుగకుండా జాగ్రత్తలు పాటించినట్టు వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ హైదరాబాద్‌లో చెప్పారు. శనివారం సాయంత్రం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. హైదరాబాద్ నుండి అమరావతి తరలివెళ్లే ఉద్యోగులకోసమే 20న అమరావతి రైలు ప్రారంభించబోతున్నట్టు ఆయన వెల్లడించారు.

06/19/2016 - 08:06

కాకినాడ, జూన్ 18: తుని దుర్ఘటనకు సంబంధించి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న ముగ్గురు కీలక నిందితులకు శుక్రవారం బెయిల్ మంజూరు కాలేదు. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణను తూర్పు గోదావరి జిల్లా సిఐడి కోర్టు ఈనెల 20వ తేదీకి వాయిదా వేసింది. జిల్లా కేంద్రం కాకినాడ సిఐడి కోర్టులో శుక్రవారం బెయిల్ పిటిషన్ కేసు విచారణకు వచ్చింది.

06/19/2016 - 08:05

హైదరాబాద్, జూన్ 18: ముద్రగడకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న తెదేపా కాపు మంత్రులు, ఎమ్మెల్యేలను కులం నుంచి బహ్కిరించాలని ఆలిండియా కాపు జాగృతి పిలుపునిచ్చింది. అదే సమయంలో నెల్లూరు జిల్లా కాపు సంఘం కూడా అధికారపార్టీలోని కాపు మంత్రులను కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమయింది.

06/18/2016 - 18:12

హైదరాబాద్: రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, ఆయన ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నామని ఎపి మంత్రి కామినేని శ్రీనివాస్ శనివారం తెలిపారు. ముద్రగడ ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు.

06/18/2016 - 16:43

విశాఖ: పిజి విద్యార్థులకు ‘స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్’ (సెట్)ను ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహిస్తుందని, ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల చేస్తామని వీసీ ఫ్రొఫెసర్ నారాయణ శనివారం తెలిపారు. మొత్తం 31 సబ్జెక్టుల్లో నిర్వహించే ఈ పరీక్షకు ఈనెల 30 నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. అపరాధ రుసుముతో సెప్టెంబర్ 1 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు.

Pages