S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/17/2016 - 13:45

విశాఖ: పాడేరు ఎఎస్పీ శశికుమార్ అనుమానాస్పద మృతిపై సిబిసిఐడి అధికారులు శుక్రవారం ఉదయం విచారణ ప్రారంభించారు. పాడేరులోని ఆయన అధికారిక నివాసంలో సాక్ష్యాధారాలను సేకరించారు. ఎఎస్పీ ఆత్మహత్య చేసుకున్నారా? ప్రమాదవశాత్తూ రివాల్వర్ పేలిందా? అన్న అనుమానాలు రావడంతో ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిబిసిఐడి విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

06/17/2016 - 07:45

తాడేపల్లి, జూన్ 16: రహదారుల విస్తరణ కోసం రాజధాని ముఖద్వారమైన ఉండవల్లిలోని సుమారు 20 ఇళ్ళు తొలగించే విషయంలో అధికారులకు, స్థానికులకు మధ్య వివాదం నెలకొంది. గత రెండు వారాలుగా రహదారుల వెడల్పుకు రోడ్డు పక్కనే ఉన్న నివాసాలకు అధికారులు మార్కింగ్ చేశారు.

06/17/2016 - 07:43

విశాఖపట్నం, జూన్ 16: వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో తమ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు అమలు జరిగేలా చూడాలని కాంగ్రెస్ నేత, సామాజిక కార్యకర్త బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు రాష్టప్రతి, కేంద్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రాలను పంపనున్నట్లు వెల్లడించారు.

06/17/2016 - 07:41

గుంటూరు, జూన్ 16: తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కసరత్తు ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లోగా పార్టీ మండల, గ్రామ, బూత్ కమిటీల స్థాయిలో బలోపేతం చేసేందుకు అవసరమైన కార్యక్రమాలను రూపొందిస్తున్నారు.

06/17/2016 - 07:40

నెల్లూరు, జూన్ 16: రెండేళ్ల పాటు ఎటువంటి అవినీతి మరక అంటకుండా పాలన అందించడమే ఎన్ డి ఏ ప్రభుత్వ తొలి విజయంగా కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పేర్కొన్నారు. గురువారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్ డి ఏ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఎటువంటి అవినీతి ఆరోపణలు, కోర్టు కేసులు ఎదుర్కోలేదని, సమర్థవంతమైన పారదర్శక పరిపాలన ప్రజలకు అందిస్తున్నామని స్పష్టం చేశారు.

06/17/2016 - 07:40

రాజమహేంద్రవరం, జూన్ 16: ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహారదీక్ష నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్తత రోజు రోజుకు పెరుగుతోంది. దీక్ష ప్రారంభం నుండీ నిషేధాజ్ఞల పేరుతో పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అడ్డుకుంటున్నా, మెల్లమెల్లగా వాటి ఉల్లంఘటనలు పెరుగుతున్నాయి.

06/17/2016 - 07:39

రెంటచింతల, జూన్ 16: నాగార్జున సాగర్ కాలువలు ఆధునీకరణతో ఆయకట్టు చివరి భూములు సస్యశ్యామలంగా మారతాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి డాక్టర్ డికెడి రాజా అన్నారు. గురువారం గుంటూరు జిల్లా రెంటచింతల మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 20 కోట్ల రూపాయలతో ఏడు మేజర్లు ఆధునికీకరణ పనుల్లో భాగంగా మండలంలోని మల్లవరం మేజర్ కాలువను పరిశీలించారు.

06/17/2016 - 07:38

నెల్లూరు, జూన్ 16: నెల్లూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. గురువారం ఆయన నెల్లూరులోని తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ రిషివ్యాలీలో ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి విద్యాసంస్థలో చదువుకున్న తనకు సమాజం పట్ల నిబద్ధత ఉందన్నారు. తాను ఎన్నో సామాజిక సేవలు చేశానన్నారు.

06/17/2016 - 07:38

భీమవరం, జూన్ 16: భారతీయ జనతాపార్టీ రాష్టక్రార్యవర్గ సమావేశాలు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించనున్నారు. ఈ నెల 24, 25 తేదీల్లో సమావేశాలు జరగనున్నాయి. పార్టీ సీనియర్ నాయకులు, ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లోని పలువురు మంత్రులతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో వివిధ హోదాల్లో ఉన్న నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపిలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు హాజరుకానున్నారు.

06/17/2016 - 07:37

గుంటూరు, జూన్ 16: రాష్ట్రం చంద్రబాబు సొంత జాగీరుకాదని శాసనమండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. కులాల మధ్య చిచ్చుపెడుతూ ప్రతిపక్షాలను, మీడియాను అణచివేస్తూ నిరంకుశ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, కాపునేత ముద్రగడ దీక్షకు మద్దతుగా గురువారం కాంగ్రెస్ నాయకులు రిలేదీక్ష చేపట్టారు.

Pages