S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/18/2016 - 16:40

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి రాకపోకలు సాగించే ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సౌకర్యార్థం విజయవాడ-సికింద్రాబాద్ మధ్య కొత్త సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 20న రైల్వేమంత్రి సురేష్ ప్రభు ప్రారంభిస్తారు. ఎపి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు ఈ కొత్త రైలును ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈనెల 22 నుంచి ఈ రైలు వారానికి ఆరుసార్లు (ఆదివారం తప్ప) నడుస్తుంది.

06/18/2016 - 13:09

విజయవాడ: వారం రోజుల్లో గ్రూప్స్‌ పరీక్షలకు కొత్త సిలబస్‌ ఖరారు చేస్తామని, రెండు నెలల్లో గ్రూప్స్‌ నోటిఫికేషన్‌ వెలువరిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయ్‌భాస్కర్‌ శనివారం తెలిపారు. నిరుద్యోగులు ఓటీపీఆర్‌ నమోదు చేసుకోవాలని, ఖాళీలపై శాఖాధిపతులతో సమావేశమై రోస్టర్‌ విధానాన్ని ఖరారు చేస్తామన్నారు.

06/18/2016 - 13:02

తిరుమల: శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలలో రెండో రోజు శనివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి హోమాలు, స్నపన తిరుమంజనం జరిగింది. సాయంత్రం స్వామివారు ఉభయదేవేరులతో కలిసి తిరువీధుల్లో వూరేగనున్నారు. ఆదివారంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.

06/18/2016 - 12:32

రాజమండ్రి: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. ముద్రగడకు ప్రస్తుతం ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు.

06/18/2016 - 12:30

విశాఖ: ఉద్యోగాల పేరిట సుమారు 300 మంది నుంచి రెండు కోట్ల రూపాయలను వసూలు చేసిన ఓ ఐటి సంస్థ బోర్డు తిప్పేసిన ఘటన విశాఖలో జరిగింది. ఇక్కడి మధురవాడ ఐటి సెజ్‌లో అక్జాల్డ్ పేరిట ఇటీవల ఓ ఐటి సంస్థను ప్రారంభించారు. 60 వేల రూపాయల చొప్పున ఉద్యోగార్థుల నుంచి డబ్బు వసూలు చేశారు. కొందరు ఉద్యోగాలు పొందాక జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది.

06/18/2016 - 12:30

అనంతపురం: ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో బైక్‌పై వెళుతున్న దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన యాడికి మండలం వేములపాడు వద్ద శనివారం ఉదయం జరిగింది. మృతులను ఓబులేశు, ఈశ్వరమ్మగా గ్రామస్థులు గుర్తించారు. ప్రమాదానికి కారకుడైన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

06/18/2016 - 04:42

విజయవాడ, జూన్ 17: వచ్చే పదేళ్ళలో పౌష్టికాహార సమస్యను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియచేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, యునిసిఫ్ సంయుక్తంగా శుక్రవారం విజయవాడలో ‘చిన్నపిల్లల్లో పౌష్టికాహార సమస్య’ అంశంపై రాష్టస్థ్రాయి సదస్సు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

06/18/2016 - 04:37

విశాఖపట్నం, జూన్ 17: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రను ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో సైతం ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

06/18/2016 - 04:35

విజయవాడ, జూన్ 17: దేశంలోనే తొలిసారిగా ఇ-క్రాప్ బుకింగ్‌ను రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వ్యవసాయం, అనుంబంధ రంగాలపై ఆయన శుక్రవారం రాత్రి తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ వరి దిగుబడిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని, రబీ దిగుబడిలో రెండో స్థానాన్ని దక్కించుకుందని చెప్పారు.

06/18/2016 - 04:29

గుంటూరు, జూన్ 17: రెండో విడత రైతు రుణమాఫీలో భాగంగా 10 శాతం వడ్డీతో కలిపి 3512 కోట్ల రూపాయలను 32,09,457 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనరేట్‌లో 13 జిల్లాలకు చెందిన అధికారులతో జరిగిన సమీక్షా సమావేశానంతరం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages