S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/16/2016 - 12:47

విజయవాడ: ఇక్కడి వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ శేఖర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఎసిబి అధికారులు గురువారం ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. విశాఖ, రాజమండ్రి, హైదరాబాద్‌లో అతని ఆస్తులపై ఆరా తీస్తున్నారు.

06/16/2016 - 12:46

విజయవాడ: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యాంజలి కార్యక్రమాన్ని ఎపి సిఎం చంద్రబాబు గురువారం నాడు గన్నవరం మండలం ఆత్కూరు ప్రభుత్వ స్కూల్‌లో ప్రారంభించారు. ప్రాథమిక పాఠశాలల్లో వసతులు కల్పించి విద్యా ప్రమాణాలు మెరుగుపరచేందుకు విద్యాంజలి కార్యక్రమాన్ని నేడు దేశవ్యాప్తంగా ప్రారంభించారు.

06/16/2016 - 12:45

కాకినాడ: సీతానగరం మండలం జానిమూడి వద్ద గురువారం ఉదయం వేగంగా వస్తున్న లారీ ఓ బైక్‌ను ఢీకొనడంతో వివాహిత మహిళ మరణించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె భర్తను ఆస్పత్రిలో చేర్పించారు. మద్యం మత్తులో లారీని నడిపిన డ్రైవర్‌ను పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. భర్త పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

06/16/2016 - 12:45

ఒంగోలు: చీరాల పట్టణంలో ఓ బాలికపై అత్యాచారం చేసినట్లు అభియోగాలు రావడంతో హోం గార్డు బాషాతో పాటు అయిదుగురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.

06/16/2016 - 12:44

విశాఖ: పాడేరు ఎఎస్పీ శశికుమార్ మృతి ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని జిల్లా ఎస్పీ రాహుల్ శర్మ మీడియాకు తెలిపారు. రివాల్వర్ పొరపాటున పేలిందా? లేక శశికుమార్ ఆత్మహత్య చేసుకున్నారా? అన్న విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఓ అధికారి నియమించినట్టు ఎస్పీ చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక ఏ విషయం నిర్ధారణ అవుతుందన్నారు.

06/16/2016 - 12:44

విశాఖ: పాడేరులో ఎఎస్పీగా పనిచేస్తున్న శశికుమార్ (30) గురువారం ఉదయం తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన బంగ్లా నుంచి తుపాకీ పేలిన శబ్దం రావడంతో తొలుత ‘మిస్‌ఫైర్’ అయిందని స్థానిక పోలీసు సిబ్బంది భావించారు. అయితే, శశికుమార్ నుదుటి మీద బుల్లెట్ గాయం కావడం, మృతదేహం సమీపంలో సూసైడ్ నోట్ లభించడంతో ఇది ఆత్మహత్యేనన్న నిర్ధారణకు పోలీసు అధికారులు వచ్చారు.

06/16/2016 - 12:43

గుంటూరు: ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల దళిత కులస్థుడేనని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు నివేదిక సమర్పించారు. రోహిత్ ఆత్మహత్య అనంతరం ఆయన కులంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. రోహిత్ తండ్రి వడ్డెర కులానికి చెందినందున అతను దళితుడు కాదన్న వాదనలు వినిపించాయి.

06/16/2016 - 08:15

నరసరావుపేట, జూన్ 15: నవ్యాంధ్రలో రోడ్ల నిర్మాణానికి కేంద్రం 65 వేల కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు బీజేపీ జాతీయ మహిళామోర్చా నాయకురాలు దగ్గుబాటి పురంధ్రీశ్వరి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని శుభం కల్యాణ మండపంలో జరిగిన వికాస్‌పర్వ్ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నలబోతు వెంకట్రావు అధ్యక్షత వహించారు.

06/16/2016 - 08:15

ఏలూరు, జూన్ 15 : పశ్చిమగోదావరి జిల్లాలో టిడిపి, బిజెపి కూటమి అగ్గి రగులుతోంది. ఈ కూటమి జిల్లా మొత్తాన్ని కైవశం చేసుకున్నా మిత్రుల మధ్యే బేధాభిప్రాయాలు పెరిగి మంత్రి మాణిక్యాలరావు రాజీనామాకు సిద్ధపడే పరిస్థితులకు దారి తీస్తోంది. తాడేపల్లిగూడెం కేంద్రంగా ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.

06/16/2016 - 08:14

విజయవాడ, జూన్ 15: ప్రభుత్వ విధానాలు నినాదాలకే కాకుండా, అవి అమలయ్యే చూడాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను సిఎం చంద్రబాబు ఆదేశించారు.

Pages