S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/14/2016 - 18:13

గుంటూరు: ఇక్కడి మిర్చియార్డులో ప్రవేశపెట్టిన ఈ-మార్కెటింగ్ విధానంపై కమీషన్ వ్యాపారులు, వారి సిబ్బంది మంగళవారం ఆందోళన చేపట్టారు. దీంతో మంగళవారం నాడు యార్డులో వ్యాపార లావాదేవీలకు బ్రేక్ పడింది. ఈ పరిణామాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించని కమీషన్ వ్యాపారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

06/14/2016 - 17:08

నెల్లూరు: జిల్లాలోని వింజమూరు ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. గత కొద్దిరోజుల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తరచూ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి.

06/14/2016 - 17:08

విజయవాడ: పేదలకు తక్కువ ధరలకే టిఫిన్లు, భోజనం అందించాలన్న ధ్యేయంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించే విషయమై ఎపి సిఎం చంద్రబాబు దృష్టి సారించారు. ఇక్కడ మంగళవారం ఆయన అన్న క్యాంటీన్ల ఏర్పాటు విషయమై సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, నారాయణ, పత్తిపాటి పుల్లారావు, పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

06/14/2016 - 17:07

విజయవాడ: టిడిపికి చెందిన కాపు ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో ఎపి సిఎం చంద్రబాబు మంగళవారం ఇక్కడ సమావేశమయ్యారు. రాజమండ్రి ఆస్పత్రిలో కాపుఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న నేపథ్యంలో తాజా పరిస్థితుల గురించి ఆయన ఆరా తీశారు. డిప్యూటీ సిఎం నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి నారాయణ, పార్టీ నాయకులు జ్యోతుల నెహ్రూ, పయ్యావుల కేశవ్, తోట నర్సింహం తదితరులతో బాబు చర్చలు జరిపారు.

06/14/2016 - 17:06

విశాఖ: నగరంలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ముఠాపై పోలీసులు మంగళవారం దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారయ్యాడు. 6.78 లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

06/14/2016 - 14:53

హైదరాబాద్: ఎపి సచివాలయం తరలింపు ప్రక్రియ ఆగస్టు 15 నాటికి పూర్తవుతుందని సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తెలిపారు. ఇప్పటికే కొన్ని శాఖలు ఎపి రాజధానికి తరలివెళ్లాయన్నారు. ఉద్యోగుల తరలింపు విషయమై ప్రభుత్వంతో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ప్రభుత్వం కచ్చితమైన మార్గదర్శకాలను జారీ చేసినందున ఎపి ఉద్యోగులంతా హైదరాబాద్‌ను వీడి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.

06/14/2016 - 14:51

తిరుపతి: ఇక్కడి రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ వాటర్ ట్యాంకులో మూడు మృతదేహాలను మంగళవారం ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్యాంకు నుంచి దుర్వాసన రావడంతో అక్కడి కూలీలు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు వచ్చి చూడగా మూడు మృతదేహాలు బయటపడ్డాయి. మృతుల్లో ఒకరిని రైల్వే స్టేషన్‌లో వాటర్‌బాటిళ్లు విక్రయించే అబ్దుల్లాగా గుర్తించారు. మిగతా మృతదేహాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

06/14/2016 - 14:51

కాకినాడ: తుని విధ్వంసకాండకు సంబంధించి అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని కోరుతూ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్ష మంగళవారం ఆరోరోజుకు చేరింది. రాజమండ్రి ఆస్పత్రిలో పోలీసులు చేర్పించినప్పటికీ ఆయన దీక్ష కొనసాగిస్తూ వైద్యాన్ని నిరాకరిస్తున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

06/14/2016 - 14:50

విజయవాడ: ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులు అంకితభావంతో పనిచేయాలని వైకాపా అధినేత జగన్ అన్నారు. ఇక్కడ మంగళవారం ప్రారంభమైన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎపిలో చంద్రబాబు రెండేళ్ల పాలనలో అవకతవకలను ప్రజలకు వివరిస్తామన్నారు. గ్రామగ్రామాన ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు రాబోయే మూడేళ్ల కాలంలో మరింత కృషి జరగాలన్నారు.

06/14/2016 - 14:50

విశాఖ: రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏనాడూ కాపుల గురించి మాట్లాడని కాంగ్రెస్ ఎంపి, సినీనటుడు చిరంజీవి నేడు ఫ్యాక్షనిస్టులకు, విధ్వంసకారులకు మద్దతు ఇవ్వడం సరికాదని పాయకరావుపేట టిడిపి ఎమ్మెల్యే అనిత విమర్శించారు. తుని ఘటనలో కడప జిల్లాకు చెందిన ఫ్యాక్షనిస్టులు, రౌడీలు రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టగా, అరెస్టు చేసిన వారిని విడిచి పెట్టాలనడం విడ్డూరంగ ఉందన్నారు.

Pages