S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/14/2016 - 12:21

కర్నూలు: డబ్బు కోసం సొంత బిడ్డను కన్నతండ్రే విక్రయించిన ఘటన నంద్యాలలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసి తల్లి హుస్సేన్ బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టణంలో గాలించి పసికందును తల్లికి అప్పగించారు.

06/14/2016 - 12:11

ఒంగోలు: వీధికుళాయి వద్ద మంచినీటి కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఆరుగురు గాయపడ్డ ఘటన గిద్దలూరు మండలం గుమ్మనపల్లిలో మంగళవారం జరిగింది. కుళాయి వద్ద నీటి కోసం వాదన మొదలై ఘర్షణగా మారంది. ఇరువర్గాల వారు పరస్పరం కత్తులతో దాడి చేసుకున్నారు. గాయపడిన ఆరుగురిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

06/14/2016 - 12:10

ఒంగోలు: కనిగిరి పట్టణంలో మంగళవారం ఉదయం పోలీసులు తనిఖీలు చేసి అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో అక్రమార్కుల గురించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

06/14/2016 - 06:32

హైదరాబాద్, జూన్ 13: సమాజం గురించి ఆలోచించడం ఎలాగో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) ముందుకు వచ్చింది. ఐఎస్‌బి ప్రతినిధి బృందం సోమవారం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావును కలిసి తమ ప్రతిపాదనల నివేదికను అందజేశారు.

06/14/2016 - 06:31

హైదరాబాద్, జూన్ 13: ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టానుసారం అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

06/14/2016 - 06:31

విజయనగరం (టౌన్), జూన్ 13: రాష్ట్ర విభజన తరవాత పెట్టబడులు, వౌలిక రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో తూర్పతీరం వెంబడి విస్తరించి ఉన్న ప్రాంతంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం మళ్లీ కోస్టల్ కారిడార్ పేరిట అనువైన స్థలాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది.

,
06/14/2016 - 06:25

కాకినాడ, జూన్ 13: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో కొనసాగిస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లాలో సోమవారం నిరసన జ్వాలలు ఎగసిపడ్డాయి. ముద్రగడ నిరాహార దీక్ష ఐదో రోజుకు చేరుకోగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు ధర్నాలు, రాస్తారోకోలతో కదంతొక్కారు.

06/14/2016 - 06:23

గుంటూరు, జూన్ 13: వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు మొదటి అంతస్థును 12 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. భవనాలను త్వరలో ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్‌అండ్‌టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు తుది మెరుగులు దిద్దుతున్నాయి. సచివాలయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలతోపాటు 25 మంది మంత్రులకు ఛాంబర్లు ఏర్పాటయ్యాయి.

06/14/2016 - 06:22

విజయవాడ, జూన్ 13: గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనుల్లో జాప్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన గన్నవరం విమానాశ్రయం ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న టెర్మినల్ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కృష్ణా పుష్కరాల ప్రారంభం లోపు టెర్మినల్ పనులు పూర్తిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

06/14/2016 - 06:20

విజయవాడ, జూన్ 13: ముఖ్యమంత్రి చంద్రబాబుపై బాణాలు ఎక్కుపెట్టి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన వైకాపా అధినేత వైఎస్ జగన్ తొలిసారిగా విజయవాడలో సోమవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా అధికార పార్టీ టిడిపిలోకి వలసపోవడం, తదనంతర పరిణామాలు, చంద్రబాబు ప్రభుత్వం వైకాపా నేతలపై చేస్తున్న ఎదురుదాడిపై జగన్ ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Pages