S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/13/2016 - 06:27

రాజమహేంద్రవరం, జూన్ 12: కాపుల కోసం ఉద్యమిస్తున్న ముద్రగడ పద్మనాభం దీక్షపై తన వైఖరిని స్పష్టం చేయాలని సినీహీరో పవన్‌కళ్యాణ్‌ను రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు డిమాండ్ చేశారు. ప్రశ్నించేందుకు పార్టీని స్థాపించిన పవన్ కాపుల సంక్షేమం కోసం ఇప్పటికైనా నోరుతెరవాలన్నారు. ఆదివారం ఆయన ముద్రగడను కలిసేందుకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చారు.

06/13/2016 - 06:25

హైదరాబాద్, జూన్ 12: ఆంధ్ర రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న ప్రాచీన గుహలు, కోటల పరిరక్షణకు కేంద్రం ప్రత్యేక నిధులు మంజూరు చేసి చర్యలు తీసుకోవాలని అమరావతి అభివృద్ధి అథారిటీ చైర్మన్ జాస్తి వీరాంజనేయులు కోరారు. ఆయన ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చారు.

06/13/2016 - 06:24

హైదరాబాద్, జూన్ 12: ఆంధ్ర రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలను రూపొందించి ఈ నెల 15వ తేదీలోపల పంపించాలని రాష్ట్రప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండు అంకెలు అంటే 15 శాతం వృద్ధిరేటు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యసాధనలో భాగంగా ఇప్పటికే మండలాలు, జిల్లాల వారీగా ప్రణాళికలను కలెక్టర్లు సమర్పించారు.

06/13/2016 - 06:24

సింహాచలం, జూన్ 12: దశాబ్దాల కాలంగా వివాదంలో ఉన్న పంచ గ్రామాల భూ సమస్య పరిష్కారమయ్యేంతవరకూ మీ ప్రాంతాల్లో వచ్చే ఎటువంటి ఎన్నికలనైనా అడ్డుకోవాలని ఉత్తరాంధ్రా జిల్లాల మేథావుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ సింహాచలం దేవస్థానం భూ బాధితులకు పిలుపునిచ్చారు.

06/13/2016 - 06:23

విజయవాడ, జూన్ 12: ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తెలియచెప్పడానికి వినియోగించుకోవలసిన ముఖ్యమంత్రి కార్యాలయంలోని మీడియా పాయింట్‌ను కాపు ఉద్యమ వేదికగా వాడుకునే పరిస్థితి ఏర్పడింది. ముద్రగడ పద్మనాభం దీక్ష చేపట్టిన తరువాత, ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని చల్లార్చేందుకు, అలాగే, ముద్రగడపై ఎదురు దాడికి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

06/13/2016 - 06:21

బైరెడ్డిపల్లి, జూన్ 12: ఇంటి వరండా స్లాబ్ కూలి అక్క, తమ్ముడు మృతి చెందిన సంఘటన శనివారం అర్ధరాత్రి చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నాచుకుప్పం గ్రామంలో జరిగింది. రఘుపతి గౌడ్, నాగమ్మ దంపతులు 8 ఏళ్ల క్రితం ఓ ఇంటిని నిర్మించుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. శనివారం రాత్రి వీరి పెద్దకుమార్తె శోభారాణి (20), తమ్ముడు తిప్పలగౌడ్ (18) ఇంటి మిద్దెపై నిద్రించారు.

,
06/13/2016 - 06:13

కాకినాడ, జూన్ 12: మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్షకు మద్దతుగా తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు, పి గన్నవరం మండల కేంద్రాల్లో ఆదివారం ఆందోళనకారులు కదం తొక్కారు. జిల్లాలో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్‌లు అమలులో ఉన్నప్పటికీ ఖాతరు చేయకుండా ఈ రెండు గ్రామాల్లో నిరసనకారులు ఆందోళన బాట పట్టారు. దీంతో సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి.

06/13/2016 - 06:09

యు కొత్తపల్లి, జూన్ 12: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంకు కొత్తపల్లి మండల కాపు సంఘ నాయకులు సంఘీభావంగా చేపట్టిన ఆందోళనలో అపశృతి చోటుచేసుకుంది. ముద్రగడ పద్మనాభంను ఉద్దేశ్యపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసిందని కాపు సంఘ నేతలు ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ ఒక కాపు సోదరుడు ఆకస్మికంగా మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.

06/13/2016 - 06:07

మదనపల్లె, జూన్ 12: చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌లో ఆదివారం టమోటా కిలో 80 రూపాయలు పలికింది. ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘడ్, ఒడిస్సా, మహారాష్ట్ర, పుదుచ్చేరి, పాండిచ్చేరి రాష్ట్రాలకు మదనపల్లె మార్కెట్ నుంచి టమోటాలు ఎగుమతి అవుతున్నాయి. ఎక్కువగా తమిళనాడులోని కుంభకోణం మార్కెట్‌కు తరలుతోంది.

06/13/2016 - 06:03

విజయవాడ, జూన్ 12: ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి వలసల కార్యక్రమం ఇంకా కొనసాగుతునే ఉంది. రాజ్యసభ ఎన్నికలకు ముందు వైకాపా నుంచి టిడిపిలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మరికొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, కొద్ది రోజులకు వైకాపాను ఖాళీ చేయిస్తామని చెప్పుకొచ్చారు. ఎందుకోకానీ, రాజ్యసభ ఎన్నికల తరువాత వైకాపా నుంచి వలసలు తగ్గాయి.

Pages