S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/14/2016 - 06:17

విశాఖపట్నం, జూన్ 13: దాదాపు 45 రోజుల విరామం తరువాత చేపల వేటను బుధవారం నుంచి ప్రారంభించేందుకు మత్స్యకారులు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. మంగళవారం గంగమ్మతల్లికి పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మత్స్యసంపద పునరుత్పత్తికి వీలుగా మే 31 నుంచి జూన్ 15 వరకూ రాష్ట్రంలోని మత్స్యకారులు వేటకు విరామం ఇస్తుంటారు. విరామం ముగుస్తుండటంతో చేపల వేట ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

06/14/2016 - 05:57

తాడిపత్రి, జూన్ 13: రాయలసీమ జిల్లాల్లో 2014-15 ఆర్థిక సంవత్సరం పన్నుల వసూళ్లలో అనంతపురం జిల్లా మొదటిస్థానంలో నిలిచిందని మునిసిపల్ రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆర్‌డి విజయలక్ష్మి మాట్లాడుతూ గత సంవత్సరం రూ.42 కోట్ల పన్నులు వసూలు చేసి అనంతపురం మొదటిస్థానంలో నిలిచిందన్నారు.

06/14/2016 - 05:56

తిరుమల, జూన్ 13: తిరుమల నుంచి మొదటి ఘాట్‌రోడ్డులో తిరుపతికి వస్తున్న ఓ టెంపో 54వ మలుపువద్ద అదుపుతప్పి పిట్టగోడను ఢీకొన్న సంఘటన సోమవారం ఉదయం జరిగింది. ఈ సంఘటనలో అందులో ప్రయాణిస్తున్న 10 మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. శ్రీవారి దర్శనం చేసుకున్న కర్ణాటకకు చెందిన పది మంది సోమవారం ఉదయం తిరుగుప్రయాణమయ్యారు.

06/14/2016 - 05:56

తిరుపతి, జూన్ 13 : టిటిడి అనుబంధ ఆలయాల్లో వేదపారాయణంతో పాటు దివ్యప్రబంధాన్ని ప్రతినిత్యం పారాయణం చేసేందుకు స్థానికంగా ఉన్న పారాయణదారుల సేవలను వినియోగించుకోవాలని టిటిడి ఇఓ సాంబశివరావు అధికారులను కోరారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో సోమవారం సీనియర్ అధికారులతో ఇఓ వారపు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ భక్తులకు గదుల్లో వేడినీళ్లు అందుబాటులో ఉంచాలన్నారు.

06/14/2016 - 05:56

విశాఖపట్నం, జూన్ 13: విద్యావ్యవస్థలో భాగస్వామ్యమవుతున్న పాఠశాలల యాజమాన్యాలు నాణ్యమైన విద్యాబోధనకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని తమిళనాడు గవర్నర్ కె.రోశయ్య పిలుపునిచ్చారు. సోమవారం నగరంలో ఒక ఛారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయంతో విశాఖ సేవా సదన్ ప్రాథమిక పాఠశాలలో పునర్నిర్మించిన తరగతి గదులను ఆయన ప్రారంభించారు.

06/14/2016 - 05:55

విశాఖపట్నం, జూన్ 13: విశాఖ నగరంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న 32 పాఠశాలలకు జిల్లా విద్యాశాఖాధికారులు సోమవారం తాళాలు వేశారు. గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ, వేసవి సెలవుల అనంతరం తెరవడంతో అధికారులు దాడులు చేసి మూయించేశారు.

06/14/2016 - 05:55

విజయవాడ , జూన్ 13: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై 11 కేసులు నమోదై వుండటమే కాకుండా ఆయన ఎ-1 ముద్దాయిగా వున్నాడని, ఈ కేసులన్నింటిపై సిబిఐ చార్జ్‌షీట్లు ఫైల్ చేసినప్పటికీ చర్యలు తీసుకోవటంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. విజయవాడలోని జిల్లా టిడిపి కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..

06/14/2016 - 05:54

కాకినాడ, జూన్ 13: అగిపోయిన పింఛను పునరుద్ధరించాలని విన్నవించుకోవడానికి కలెక్టరేట్‌కు వెళ్లిన ఒక వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందిన సంఘటన సోమవారం కాకినాడలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం విరవ గ్రామానికి చెందిన అర్జనపూడి వెంకటలక్ష్మి (70) అనే వృద్ధురాలికి గత ఏడు నెలలుగా ఫించను అగిపోయింది. పిఠాపురం తహసీల్దారు, ఎంపిడిఒకు గోడు వెళ్ళబుచ్చుకున్నా ఫలితం లేకపోయింది.

06/14/2016 - 05:54

విజయవాడ, జూన్ 13: విజయవాడ మెట్రోను నిధుల కొరత వెంటాడుతోంది. 2018 నాటికి విజయవాడ మెట్రో పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నా, ఇప్పటివరకూ పనులు ప్రారంభించకపోవడం గమనార్హం. ఇప్పటికిప్పుడు ప్రారంభించినా 2018 నాటికి మెట్రో రైలు పట్టాలెక్కే పరిస్థితి లేదు. హైదరాబాద్ మెట్రోయే ఇందుకు నిదర్శనం. మెట్రో రైలుకు కావాల్సిన బడ్జెట్, భూసేకరణకు అవసరమైన నిధులు మంజూరు కాలేదు.

06/14/2016 - 05:53

విజయవాడ, జూన్ 13: విజయవాడలో ఈ నెల 15న జరగాల్సిన రాష్ట్ర కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ప్రస్తుతం తాత్కాలిక సెక్రటేరియట్ నిర్మాణం, ఉద్యోగుల తరలింపు వ్యవహారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి బిజీగా ఉండటం వల్ల ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది.

Pages