S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/15/2016 - 17:06

రాజమండ్రి: ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో విశాఖ రేంజి డిఐజి శ్రీకాంత్, ఎస్‌పిలు రవిప్రకాష్, రాజకుమారి బుధవారం భేటీ అయ్యారు. దీక్ష విరమింపజేసేందుకు ప్రభుత్వ ప్రతిపాదనలపై వారు ఆయనతో చర్చించినట్లు సమాచారం.

06/15/2016 - 17:06

గుంటూరు: వ్యక్తిగతంగా, కుటుంబపరంగా ఎన్ని సమస్యలున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజాహితమే ప్రథమ కర్తవ్యం అని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన బుధవారం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం పనులను పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ నుంచి పరిపాలనా వ్యవస్థ అంతా నవ్యాంధ్ర రాజధానికి తరలిరావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

06/15/2016 - 17:05

హైదరాబాద్: వైకాపా అధినేత జగన్‌కు మరో షాక్ తగలనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ప్రస్తుతం వినిపిస్తోంది. కొంతకాలంగా పార్టీ అధ్యక్షుడు జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. అసెంబ్లీలో పిఎసి అధ్యక్ష పదవి దక్కనందున ఆయన కొంతకాలంగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

06/15/2016 - 17:04

గుంటూరు: తూళ్లూరు మండలం వెలగపూడి వద్ద తాత్కాలిక సచివాలయం నిర్మాణం పనులను ఎపి సిఎం చంద్రబాబు బుధవారం ఉదయం నుంచి పరిశీలిస్తున్నారు. భవన నిర్మాణం పనులు జోరుగా సాగుతున్నాయని అధికారులు వివరించారు. ఈనెల 27 నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి పరిపాలన మొదలుకావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి సచివాలయం పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు.

06/15/2016 - 17:03

గుంటూరు: తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు బుధవారం ఇక్కడి నాగార్జున విశ్వవిద్యాలయం వద్ద ఆందోళన ప్రారంభించారు. జాతీయ రహదారిపై బైఠాయించి వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అగ్రిగోల్డ్ సంస్థపై నమోదైన కేసులను వెంటనే పరిష్కరించాలని, ఆ సంస్థ ఆస్తులను వేలం వేసి తమకు నష్టపరిహారం చెల్లించాలని వారు కోరుతున్నారు.

06/15/2016 - 14:19

హైదరాబాద్: విపక్షనేతకు చెందిన ఎలక్ట్రానిక్ మీడియాను ఎపిలో నియంత్రించడం దారుణమని కాంగ్రెస్ నాయకుడు శైలజానాథ్ విమర్శించారు. ఆయన బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ, చంద్రబాబు పాలన నియంతృత్వానికి నిదర్శనంగా ఉందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని దీక్ష చేస్తున్న కాపునేత ముద్రగడను పోలీసులు అప్రజాస్వామిక పద్ధతుల్లో అరెస్టు చేశారని ఆయన విమర్శించారు.

06/15/2016 - 12:20

విజయవాడ: ఆమరణ దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో మరోసారి చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఒక ప్రతినిధి బృందాన్ని పంపేందుకు కసరత్తు జరుగుతోందని ఎపి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప బుధవారం మీడియాకు తెలిపారు. సిఎం చంద్రబాబును చినరాజప్ప, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఈరోజు ఉదయం కలిశారు.

06/15/2016 - 12:19

రాజమండ్రి: ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ దీక్ష బుధవారం ఏడో రోజుకు చేరింది. రక్తపరీక్షలు చేయించుకునేందుకు ఆయన నిరాకరిస్తున్నట్లు, అయితే రెండు గంటలకోసారి బీపీ పరీక్ష చేయించుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల సహాయంతో ఆయనకు ఈరోజు సాయంత్రంలోగా వైద్యచికిత్స అందిస్తామని డాక్టర్లు తెలిపారు.

06/15/2016 - 12:19

గుంటూరు: రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టే వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. నకిలీ విత్తనాల గురించి వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని ఆయన రైతులను కోరారు. నవ్యాంధ్ర రాజధానికి ఈనెలాఖరులోగా వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖల కార్యాలయాలన్నీ తరలివెళతాయన్నారు.

06/15/2016 - 12:18

విజయవాడ: నగరంలోని స్టెల్లా కళాశాల సమీపంలోని కెనరా బ్యాంకు ఎటిఎంలో ఓ ఆగంతకుడు మంగళవారం రాత్రి ప్రవేశించి నగదు చోరీ చేసేందుకు ప్రయత్నించాడు. ఎటిఎంలో శబ్దం విని అక్కడికి వచ్చిన సెక్యూరిటీ గార్డుపై ఆ వ్యక్తి దాడి చేశాడు. గాయపడిన గార్డుకు ఆస్పత్రిలో చికిత్స అందించారు.

Pages