ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్యేలకు ఐఎస్‌బి శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 13: సమాజం గురించి ఆలోచించడం ఎలాగో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇచ్చేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బి) ముందుకు వచ్చింది. ఐఎస్‌బి ప్రతినిధి బృందం సోమవారం స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావును కలిసి తమ ప్రతిపాదనల నివేదికను అందజేశారు. నాయకత్వ పటిమ, ఆర్థికాభివృద్ధి, పాలసీ నిర్ధారణ, సమాజం గురించి ఆలోచించడం, సంక్షేమ పథకాల అమలు వంటి అనేక అంశాలపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ఐఎస్‌బి రెండు రోజుల శిక్షణ కార్యాక్రమాన్ని రూపొందించింది. తమ పనితీరును మెరుగు పరుచుకోవడంతో పాటు కొత్తగా ఆలోచించడం, వినూత్న భావనలు, తక్కువ వ్యయంతో ఎక్కువ ఉత్పత్తి సాధించేలా ప్రణాళికలను రూపొందించడం, ఎక్కువ మంది ప్రజలతో మమేకం కావడం, సమస్యలను వెనువెంటనే పరిష్కరించే సామర్థ్యాన్ని పొందడం వంటివి సాధ్యమవుతాయి. ఐఎస్‌బి సెంటర్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ హెడ్ మమతారెడ్డి, సీనియర్ మేనేజర్ సందీప్ జమ్మలమడక ఈ అంశాలను స్పీకర్‌కు వివరించారు.