ఆంధ్రప్రదేశ్‌

సందడి మొదలైంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 13: వెలగపూడి తాత్కాలిక సచివాలయంలో గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు మొదటి అంతస్థును 12 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. భవనాలను త్వరలో ప్రభుత్వానికి అప్పగించేందుకు ఎల్‌అండ్‌టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు తుది మెరుగులు దిద్దుతున్నాయి. సచివాలయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేషీలతోపాటు 25 మంది మంత్రులకు ఛాంబర్లు ఏర్పాటయ్యాయి. మొదటి అంతస్థు మొదటి భవనంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాలు, గ్రౌండ్‌ఫ్లోర్‌లో జనరల్ అడ్మినిస్ట్రేషన్ (జీఏడి)ని, న్యాయశాఖ పరిధిలోని పది విభాగాలను 6వేల 850 చ.అడుగుల విస్తీర్ణం కలిగిన భవనంతోపాటు సీఎం సమావేశ మందిరం, బిల్డింగ్-2లో ఐదుగురు మంత్రుల ఛాంబర్లు ఫైనాన్స్, ప్లానింగ్ విభాగాలు, గ్రౌండ్‌ఫ్లోర్‌లో మరో ఐదుగురు మంత్రుల పేషీలు, పరిశ్రమలు, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్,పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, హోంశాఖ కార్యాలయాలను ఏర్పాటు చేస్తారు. బిల్డింగ్-3 మొదటి అంతస్థులో ఐదుగురు మంత్రుల పేషీలు,సాంఘిక సంక్షేమం, బలహీన వర్గాల సంక్షేమ శాఖ, మైనారిటీ సంక్షేమం, స్ర్తి, శిశు సంక్షేమ, స్కిల్ డెవలప్‌మెంట్‌కు సిద్ధం చేశారు. కాగా ఇదే భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఐటీ డిపార్టుమెంట్లు, సెంట్రల్ రికార్డు రూం, వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. బిల్డింగ్-4 మొదటి అంతస్థులో ఐదుగురు మంత్రులు, జలవనరులు, ఆర్‌ఎస్‌ఎడి, ప్రైమరీ స్కూల్, హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగాలు, ఐటి అండ్ టీలను తరలిస్తారు. ఇదే భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఐదుగురు మంత్రులకు కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు. అలాగే ఏహెచ్‌డీడీఎఫ్, సీఐఎస్, సీఎస్ కార్యాలయాలు ఏర్పాటవుతాయి. బిల్డింగ్-5 మొదటి అంతస్థులో ఐదుగురు మంత్రుల కార్యాలయాలతో పాటు ట్రాన్స్‌పోర్టు, రోడ్లు, భవనాలు, ఏపివీవీసి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదే భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో సీఆర్ అండ్ ఆర్ అండ్ బీ, బీహెచ్‌ఎం అండ్ ఎస్ డబ్ల్యు, ఎల్‌ఈటి, హౌసింగ్ శాఖలకు కేటాయించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రులిద్దరితో పాటు 17 మంది మంత్రులున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో ఐదుగురు మంత్రులకు పేషీలను ముందస్తుగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.