ఆంధ్రప్రదేశ్‌

కోస్టల్ కారిడార్ ప్రతిపాదనలకు కదలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం (టౌన్), జూన్ 13: రాష్ట్ర విభజన తరవాత పెట్టబడులు, వౌలిక రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో తూర్పతీరం వెంబడి విస్తరించి ఉన్న ప్రాంతంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం మళ్లీ కోస్టల్ కారిడార్ పేరిట అనువైన స్థలాలను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. విభజనతో ఆర్థికంగా, ఉపాధి కల్పనపరంగా అవకాశాలు కోల్పోయిన రాష్ట్రం తలసరి ఆదాయంలో ముందంజ వేయాలంటే పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి చేపట్టాల్సి ఉంది. అయితే నిధులు లభ్యత అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇటీవల విశాఖపట్టణంలో భాగస్వామ్య సదస్సును నిర్వహించింది. భారీగా ఈసదస్సులో పెట్టుబడులకు హామీలు , ఒప్పందాలు ప్రభుత్వం కుదుర్చుకుంది. అయితే పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు నెలకొల్పాలంటే అందుకు తగిన వౌలిక సదుపాయాలు లేనిదే కార్యరూపం దాల్చదు. ఈనేపథ్యంలో ప్రభుత్వం బంగాళాఖాతం తీరం వెంబడి విస్తరించి ఉన్న తీరప్రాంత గ్రామాల్లో అందుబాటులోని స్థలాలను గుర్తించాలని రెవెన్యూ యంత్రాగానికి ఇటీవల ఆదేశాలు అందాయి. జిల్లాలో రెండు తీర మండలాలు ఉన్నాయి. భోగాపురం , పూసపాటిరేగలో దాదాపు 14 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. ఈరెండు మండలాల పరిధిలో 21 తీర గ్రామాలు ఉన్నాయి. గతంలో యుపిఎ పాలనలో కోస్టల్ కారిడార్ పేరిట కోల్‌కతానుండి చెన్నైవరకు కోస్టల్ కారిడార్ పేరిట తీరం వెంబడి పరిశ్రమలు పెట్రో కెమికల్ పరిశ్రమలకు భూములు కేటాయించాలని నిర్ణయించారు. అందుకు చేసిన ప్రయత్నాలను అప్పట్లో వామపక్షాలు పెద్ద ఎత్తున తీవ్రంగా నిరసిస్తూ బస్సు యాత్ర నిర్వహించి ఆందోళన చేసాయి. అయితే ప్రస్తుతం కాలుష్య రహిత పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా గతంలో ఎదురయిన ఇబ్బందులు ఇపుడు పనరావృతం కాకుండా అధిగమించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కాలుష్యరహత పరిశ్రమలు, హోటల్ రంగాన్ని , ప్రత్యేక నౌకాయానాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. తద్వారా ఉపాధి అకాశాలను అందిపుచ్చుకుని నిరుద్యోగానికి చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే తీరంలోని భోగాపురం మండలం గూడెపువలసలో 5000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం భూసేకరణ పనులు వేగవంతం చేసింది. అక్కడి గ్రామస్తుల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నా ముందడుగు వేస్తోంది. స్మార్ట్ సిటీ విశాఖ పట్టణానికి అత్యంత సమీపంలో జిల్లాకు చెందిన తీర మండలాలు ఉండటంతో ప్రభుత్వం ముందస్తుగా ఈప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించిందని సమాచారం. కోస్టల్ కారిడార్ కోసం అవసరమైన స్థలాలు గుర్తించాలని తీర మండలాల రెవెన్యూ అధికారులకు ప్రభుత్వం నుండి ఆదేశాలు అందాయి. రహదారులు, ఇతర అవసరాలకు ఇప్పటికే పూసపాటిరేగ మండలం తిప్పలవలస సమీపంలోని అటవీ భూములను పరిశీలించారు. అయితే అటవీశాఖ భూములు కావడం వలన దీనిపై తదుపరి చర్యలకు ప్రభుత్వానికి తెలియజేయనున్నారు. అన్నీ అనుకూలిస్తే తీరం పర్యాటకంగా, పారిశ్రామికంగా ముందడుగు వేయనుంది.