ఆంధ్రప్రదేశ్‌

లోపాల్ని సహించను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 15: ప్రభుత్వ విధానాలు నినాదాలకే కాకుండా, అవి అమలయ్యే చూడాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను సిఎం చంద్రబాబు ఆదేశించారు.
అధికారుల్లో సమన్వయ లో పాన్ని ఎట్టి పరిస్థితుల్లోను సహించబోనని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రైతులు వ్యవసాయ సీజన్ కోల్పోకుండా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. బుధవారం సిఎం తన నివాసం నుంచి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ శాఖలోనూ పనులు స్తంభించకూడదని ఆయన హెచ్చరించారు. కచ్చితమైన కార్యాచరణ కనిపించాలని ఆయన సూచించారు.
ప్రతి ఉద్యోగి సామర్థ్యాన్ని విశే్లషించి, తగిన పనితీరు కనబరచకపోతే చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. భవిష్యత్‌లో వచ్చే భారీ వర్షాలకు చెరువులు తెగకుండా కట్టలు పటిష్టం చేయాలని, దీనిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సిఎం ఆదేశించారు.
సకాలంలో పంటలకు నీరందాలన్న ఉద్దేశంతోనే లక్షలాది పంటకుంటల్ని తవ్విస్తున్నామని చెప్పారు. రెయిన్ గన్స్‌ను కాలయాపన చేయకుండా సకాలంలో అన్నిచోట్ల ఏర్పాటు చేయాలని సూచించారు. భూగర్భ జలాలను పెంచుకుంటూ, నదులు అనుసంధానం చేస్తూ, వాతావరణ మార్పులకు అనుగుణంగా జల సంరక్షణ పనులు ముమ్మరం చేస్తే కరవు లేకుండా చేయచ్చని సిఎం అభిప్రాయపడ్డారు.
జన జీవన భద్రత ప్రభుత్వాల బాధ్యత అని చంద్రబాబు అన్నారు. ఆహార, నీరు, విద్యుత్, పశుగ్రాసం, ఫైబర్ భద్రతతోపాటు విజ్ఞాన భద్రత కూడా ప్రజలకు ఇవ్వడమే లక్ష్యంగా యంత్రాంగం పనిచేయాలని ఆయన సూచించారు. రాష్టవ్య్రాప్తంగా 6.32 లక్షల పంటకుంటలు మంజూరు చేస్తే, 2.32 లక్షల పంట కుంటల పనులు ప్రారంభించారని, ఇందులో 27,604 మాత్రమే పూర్తి చేయడం పట్ల సిఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంకుడుగుంతల తవ్వకం ముమ్మరంగా జరుగుతుండడం సంతోషదాయకమని ఆయన అన్నారు. రాష్ట్రంలో 40 వేల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకం ప్రారంభించారని, అదే ఉత్సాహాన్ని పంటకుంటల పనుల్లో కూడా చూపాలని ఆయన కోరారు.