ఆంధ్రప్రదేశ్‌

దీక్ష విరమణకు ముద్రగడ షరతులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 14: తుని దుర్ఘటనలో ఆందోళనకారులపై సిఐడి పెట్టిన కేసులన్నిటినీ ఉపసంహరించడంతోపాటు ఆగస్టు నెలాఖరులోగా కాపులను బిసిలుగా గుర్తిస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేంతవరకు నిరాహార దీక్ష కొనసాగించాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ముద్రగడతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు ముందుకువచ్చిన నేపథ్యంలో ఈ రెండు డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా లేనని కూడా ఆయన స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వం మొండిగా వ్యవహరించిన పక్షంలో తాను అంతకంటే మొండిగా దీక్ష కొనసాగిస్తానని, చివరకు తన శవాన్ని చూడాల్సి వస్తుందని కూడా ముద్రగడ హెచ్చరిస్తున్నట్టు కిర్లంపూడికి చెందిన ముద్రగడ సన్నిహితులు ‘ఆంధ్రభూమి ప్రతినిధి’కి తెలియజేశారు. మంజునాథన్ కమీషన్ నివేదిక ఆరు నెలల్లోగా ప్రభుత్వానికి అందేలా చేసి, ఆగస్టు నెలాఖరులోగా కాపులను బిసిలలో చేరుస్తామని ప్రభుత్వం అప్పట్లో ముద్రగడకు హామీ ఇచ్చింది. తాజా పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు తేదీ ఆగస్టులోగా కాపులను బిసిలలో చేరుస్తామంటూ అధికారికంగా హామీ ఇవ్వాలని, ఆందోళకారులపై పెట్టిన కేసులన్నిటినీ బేషరతుగా రద్దు చేయాలని, అలాగైతైనే దీక్ష విరమించాలని ముద్రగడ నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతోంది. అలాగే జైలులో ఉన్న 13మందిని విడుదల చేయాలని, ఆందోళనకారులపై పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేయాలని కూడా ముద్రగడ స్పష్టం చేస్తున్నట్టు తెలిసింది.