S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/21/2016 - 08:33

విజయవాడ, జూన్ 20: కృష్ణా పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రైల్వే ఉన్నతాధికారులు కలిసి సమన్వయంతో పనిచేస్తూ విజయవంతంగా నిర్వహించాలని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కలిసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం రాత్రి వీరు ఇక్కడ సమావేశమై పుష్కరాల నిర్వహణకు సంబంధించి చర్చించారు.

06/21/2016 - 08:16

విజయవాడ, జూన్ 20: వర్షాల వల్ల రైతులంతా హాజరుకాలేరన్న భావనతోనే నేలపాడులో ఆప్రాంత రైతుల విజ్ఞప్తుల మేరకు సోమవారం జరగాల్సిన ప్లాట్ల కేటాయింపు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు.

06/21/2016 - 08:16

నూజివీడు, జూన్ 20: రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రంలో మరో మూడు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని విశ్వవిద్యాలయ ఉప కులపతి విజయ్‌ప్రకాష్ తెలిపారు.

06/21/2016 - 08:15

సింహాచలం, జూన్ 20: ఆచార్య బ్రహ్మ, వేద రత్నాకర వడ్లమాని వేంకటేశ్వర అవధాని పరబ్రహ్మ స్వరూపుడని పలువురు పండితోత్తములు కీర్తించారు. సింహాచలంలోని శ్రీ వేదానంద గురుకుల పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో సోమవారం వేంకటేశ్వర అవధానికి శృంగేరి పీఠాధిపతి అనంత శ్రీసచ్చిదానంద సరస్వతి మహాస్వామి చేతుల మీదుగా గండ పెండేర సన్మానోత్సవం స్థానిక శ్రీ రామానుజ కూటమిలో జరిగింది.

06/21/2016 - 08:14

విజయవాడ/మేడికొండూరు , జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పౌర్ణమి ఏరువాక కార్య క్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి దేవినేని ఉమ పాల్గొన్నారు. విజయవాడ రూరల్ గొల్లపూడి గ్రామంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నాగలితో దుక్కిదున్ని ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

06/21/2016 - 08:13

నరసాపురం, జూన్ 20: భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుటుని విద్యుత్ పొదుపు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే తొలిసారిగా విద్యుత్ ఆదాచేసే ఎల్‌ఇడి ఫ్యాన్ల పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరంలో సోమవారం ప్రారంభించారు.

06/21/2016 - 08:39

గుంటూరు, జూన్ 20: రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. వర్షం వల్ల వాయిదా వేస్తున్నట్లు సోమవారం మంత్రి నారాయణ, సిఆర్‌డిఎ అధికారులు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేలపాడు గ్రామంలో ప్లాట్ల పంపిణీని ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద భారీ బహిరంగ సభావేదికను సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు.

06/21/2016 - 08:07

తిరుపతి, జూన్ 20: పిల్లల్లో వేదాల పట్ల మక్కువ పెంచేందుకు టిటిడి వేద పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను సరళతరం చేయాలని టిటిడి ఇవో సాంబశివరావు అధికారులను ఆదేశించారు.

06/21/2016 - 08:05

ఆకివీడు, జూన్ 20: బ్యాంకులో రుణాల కోసం ఖాతాదార్లు కుదువపెట్టిన సుమారు రూ.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు కార్పొరేషన్ బ్యాంకు శాఖలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొద్ది రోజుల క్రితమే ఈ వ్యవహారం వెల్లడైనా, బ్యాంకు అధికార్లు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

06/21/2016 - 08:05

జగ్గయ్యపేట రూరల్, జూన్ 20: కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం బండిపాలెం గ్రామానికి చెందిన విద్యార్థి పుట్టా నరేష్ (25) అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌ఫ్రాన్సిస్‌కోలో బోట్ షికారుకు వెళ్లి గల్లంతయ్యాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచ్ఛాయలు అలముకున్నాయి. వ్యవసాయ కుటుంబానికి చెందిన పుట్టా పూర్ణయ్య - లక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు నరేష్ ఏడాదిన్నర క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.

Pages