S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/20/2016 - 18:11

విజయవాడ: వ్యవసాయ శాఖ, అనుబంధ విభాగాల అధికారులు స్వయంగా పొలంలోకి దిగితేనే రైతుల కష్టనష్టాలు తెలుస్తాయని మంత్రి దేవినేని రమణ అన్నారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఆయన సోమవారం ఉదయం ఇక్కడి గొల్లపూడి వద్ద కాడెద్దులను అదిలిస్తూ పొలం దున్నారు. ఆ సమయంలో వ్యవసాయ శాఖ అధికారులు రోడ్డుపైన నిలబడి ఉండడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు కూడా పొలంలోకి దిగాల్సి వచ్చింది.

06/20/2016 - 18:07

విజయవాడ: అభివృద్ధి పనులకు నిబంధనల ప్రకారం టెండర్లు పిలవలేదనే ఆరోపణల నేపథ్యంలో సోమవారం దుర్గగుడి ఈఈ కోటేశ్వరరావు ఆఫీసులో విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు చేశారు.

06/20/2016 - 16:08

ఏలూరు: కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం సాగునీటి ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని ఎపి సిఎం చంద్రబాబు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా చిట్టవరంలో ఏరువాక కార్యక్రమం ప్రారంభం సందర్భంగా అన్నారు. రెండోపంటకు నీరిచ్చిన ఘనత తమకే దక్కిందన్నారు. గత పాలకులు రైతులను అన్ని విధాలా నిర్లక్ష్యం చేయగా, తాము రుణమాఫీతో ఆదుకున్నామన్నారు.

06/20/2016 - 16:07

ఏలూరు: యాంత్రీకరణ, ఉత్పత్తి రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీపడి మంచి ఫలితాలను సాధించాలని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు, బీసీలకు, మహిళలకు, విద్యార్థులకు తమ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని ఆయన వివరించారు. కాపులకు రిజర్వేషన్లు సహా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామన్నారు.

06/20/2016 - 16:05

విజయనగరం: గ్రానైట్ కోసం కొండలను తవ్వి పర్యావరణానికి, తమ ఉపాధికి చేటు చేయవద్దని సిపిఎం నేతృత్వంలో సోమవారం పార్వతీపురంలోని ఐటిడిఎ వద్ద గిరిజన సంఘాలు ఆందోళన నిర్వహించాయి. పార్వతీపురం మండలం బోడికొండపై గ్రానైట్ తవ్వకాలకు అధికారులు అనుమతులిస్తే తాము ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. గ్రానైట్ తవ్వకాలపై తమ మనోభావాలను ఇకనైనా ప్రభుత్వం గుర్తించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.

06/20/2016 - 16:04

విజయవాడ: రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈనెల 26న సిఎం చంద్రబాబు ఇళ్లస్థలాలను పంపిణీ చేస్తారని మంత్రి నారాయణ తెలిపారు. అదే రోజు ఆరులైన్ల రహదారి పనులను, వెలగపూడిలో ఎన్టీఆర్ క్యాంటీన్‌ను సిఎం ప్రారంభిస్తారని తెలిపారు. రాజధాని ప్రాంతంలో వరద ముప్పు పరిస్థితిపై నెదర్లాండ్స్ బృందం అధ్యయనం చేస్తుందన్నారు.

06/20/2016 - 13:46

విజయవాడ: నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి పంటపొలాలు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించే కార్యక్రమం వాయిదా పడింది. అమరావతి ప్రాంతంలో సోమవారం లాటరీ పద్ధతిలో రైతులకు స్థలాలు కేటాయిస్తామని సిఆర్‌డిఎ అధికారులు ప్రకటించారు. అయితే, ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ఈ కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసినట్లు మున్సిపల్ మంత్రి నారాయణ తెలిపారు.

06/20/2016 - 11:59

రాజమండ్రి: ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడి నన్నయ విశ్వవిద్యాలయంలో ‘పిజి డిప్లమో ఇన్ యోగా’ పేరిట కొత్త కోర్సును మంగళవారం ప్రారంభిస్తున్నారు. ఆసక్తిగల వారు వెంటనే దరఖాస్తులు చేసుకునేందుకు తమను సంప్రదించాలని వర్సిటీ వైస్ చాన్సలర్ తెలిపారు.

06/20/2016 - 11:57

విశాఖ: కేంద్ర రైల్వేశాఖా మంత్రి సురేష్ ప్రభు మంగళవారం విశాఖలో జరుపతలపెట్టిన పర్యటన చివరి నిమిషంలో వాయిదా పడింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రత్యేక ఇంటర్ సిటీ రైలును ప్రారంభించేందుకు విజయవాడ వచ్చిన ఆయన విశాఖలోనూ పర్యటిస్తారని తొలుత అధికారులు ప్రకటించారు. ఇక్కడికి వస్తే రైల్వేజోన్ గురించి ప్రకటన చేయాల్సి వస్తుందన్న కారణంగానే సురేష్ ప్రభు వాయిదా పడిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

06/20/2016 - 07:55

విశాఖపట్నం, జూన్ 19: తన రాజకీయ జీవిత ఉన్నతికి ఆచార్య రంగా మార్గదర్శకుడని, ఆయన ప్రోత్సాహంతోనే తన రాజకీయ ప్రస్థానం మొదలైందని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. టిఎస్సార్ సేవాపీఠం, వెలువోలు ట్రస్టు ఆధ్వర్యంలో ఆచార్య రంగా వర్ధంతిని పురస్కరించుకుని విశాఖలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ రోశయ్యకు స్వర్ణకంకణ ధారణ జరిగింది.

Pages