ఆంధ్రప్రదేశ్‌

రాజకీయ ఉన్నతికి ఆచార్య రంగా మార్గదర్శకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 19: తన రాజకీయ జీవిత ఉన్నతికి ఆచార్య రంగా మార్గదర్శకుడని, ఆయన ప్రోత్సాహంతోనే తన రాజకీయ ప్రస్థానం మొదలైందని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. టిఎస్సార్ సేవాపీఠం, వెలువోలు ట్రస్టు ఆధ్వర్యంలో ఆచార్య రంగా వర్ధంతిని పురస్కరించుకుని విశాఖలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ రోశయ్యకు స్వర్ణకంకణ ధారణ జరిగింది. ఈ సందర్భంగా తనకు జరిగిన ఈ విశేష సత్కార సభలో రోశయ్య మాట్లాడారు. ఎంతో మందిని రాజకీయంగా తీర్చిదిద్దిన ఘనత ఆచార్య రంగాకు దక్కుతుందన్నారు. పదవులకోసం ఆయన ఏనాడూ పాకులాడలేదని, నెహ్రూ, ఇందిరలతో సైతం విబేధించిన సందర్భాలున్నాయని గుర్తు చేశారు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎక్కడా రాజీ పడలేదని, పార్టీలు మారిన విమర్శలపై ఆచార్య రంగా చక్కటి వివరణ ఇచ్చారన్నారు. రైతు సంక్షేమం కోసమే తాను రాజకీయ పార్టీలతో సైద్ధాంతికంగా విబేధించాల్సి వచ్చింని ఆయన పేర్కొనేవారన్నారు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ జైకిసాన్ అన్న నినాదం దాదాపు కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు అన్నం పెడితే, సైనికుడు భద్రతనిస్తున్నాడని వారి దేశభక్తి అనితర సాధ్యమన్నారు. నిత్యం దైవారాధన చేసే బ్రాహ్మణోత్తమునికన్నా రైతు గొప్పవాడన్నారు. ఆచార్య రంగా శిష్యునిగా గవర్నర్ స్థాయికి ఎదిగిన రోశయ్య స్వయం కృషిని కొనియాడారు. ఎంపి సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ రంగ మహోన్నత వ్యక్తిగా కొనియాడారు. రైతు ఉద్యమనేతగా ఆయన అందించిన సేవలు ఈ తరం గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపి హరిబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. పు
తమిళనాడు గవర్నర్ రోశయ్యకు స్వర్ణకంకణ ధారణ చేస్తున్న
శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి.
చిత్రంలో ఎంపి సుబ్బరామిరెడ్డి తదితరులు