S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/20/2016 - 07:21

విజయవాడ, జూన్ 19: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాష్టవ్య్రాప్తంగా త్వరలో స్మార్ట్ సర్వే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు.

06/20/2016 - 07:21

భీమవరం, జూన్ 19: గోదావరి నదికి శివార్లలో ఉన్న ఉభయ గోదావరి జిల్లాల రైతుల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణలో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాలను తక్షణం నిలుపుచేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కార్యచరణ సమితి డిమాండుచేసింది. ఎత్తిపోతల పథకాలు నిలువరించని పక్షంలో భవిష్యత్తులో రైతు కుటుంబాలన్నీ రోడ్డున పడతాయని సమితి పేర్కొంది.

06/20/2016 - 07:20

విశాఖపట్నం, జూన్ 19: ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయాన్ని కల్పించేందుకు ఆంధ్ర రాష్ట్రంలో మూడు వేల కొత్త బస్సులు ప్రవేశపెడుతున్నట్టు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.సాంబశివరావు వెల్లడించారు. ఇక్కడి ఆర్టీసీ ద్వారకా కాంప్లెక్స్‌లో ఆదివారం సాయంత్రం ఆయన ప్రయాణికులకు ఉపయోగపడే మొబైల్‌యాప్‌ను, ఇన్ఫర్మేషన్ కియాస్క్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు.

06/20/2016 - 07:19

విజయపురిసౌత్, జూన్ 19: శ్రీశైలం జలాశయం నుండి సాగర్ ప్రాజెక్టుకు నీటి చేరిక పూర్తిగా నిలిచిపోవడంతో రోజురోజుకు నీటిమట్టం తగ్గిపోతోంది. ఆదివారం సాయంత్రానికి సాగర్ జలాశయం నీటిమట్టం 505 అడుగులకు చేరుకుంది. ఇది 123.33 టీయంసీలకు సమానం. హైదరాబాద్ వాసులకు తాగునీటి అవసరాల నిమిత్తం ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 777.50 అడుగుల వద్ద కొనసాగుతోంది.

06/20/2016 - 07:17

అనంతపురం, జూన్ 19: సమాజంలో మహిళల సంరక్షణను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి సూచించారు. ప్రస్తుత సమాజంలో మహిళలతో పాటు పురుషులను కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. అనంతపురం నగరంలోని డిఆర్‌డిఎ అభ్యుదయ హాలులో ఆదివారం ‘మహిళా సాధికారత, బాలికా విద్య, బాలల హక్కులు, మీడియా పాత్ర’ అంశంపై రాయలసీమ స్థాయి ప్రాంతీయ సదస్సు నిర్వహించారు.

06/20/2016 - 07:16

రాజమహేంద్రవరం, జూన్ 19: ‘రెండు రోజుల్లో మట్టిలో కలిసిపోయే దేహానికి ఈ పరీక్షలు అవసరమా...’ కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆదివారం రాత్రి తన సమీప బంధువుతో పలికిన మాటలివి. ఆదివారం ముద్రగడ దంపతుల దీక్ష 11వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన వియ్యంకుడు (చిన్న కోడలి తండ్రి) సోమేశ్వరరావు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించారు. రాత్రి సమయంలో ఆసుపత్రి నుండి బయటకు వచ్చిన ఆయనను మీడియా చుట్టుముట్టింది.

06/20/2016 - 07:12

ద్వారకాతిరుమల, జూన్ 19: గర్భాలయంలో కొలువైన శివయ్య లింగ స్వరూపంపై శివుని రూపం సాక్షాత్కరించడం భక్తులను పరవశింపచేసింది. పాలతో అభిషేకించిన శివలింగాన్ని నీటితో కడిగే సమయంలో ఈ అద్భుత రూపం దర్శనమిచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఐఎస్ రాఘవాపురం పంచాయతీ తూరల లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం ఈ వింత చోటుచేసుకుంది.

06/20/2016 - 07:02

విశాఖపట్నం, జూన్ 19: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మం త్రిత్వ శాఖలు తాము ప్రవేశపెట్టనున్న పథకాలకు పేర్లు, లోగోలను డిజైన్ చేయాల్సిందిగా ప్రజలను కోరుతున్నాయి. కేంద్రప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తూ వాటికి ఆకర్షణీయమైన పేర్లు పెట్టేందుకు, లోగోలను, ట్యాగ్ లైన్లను రూపొందించేందుకు ఎంట్రీలను ఆహ్వానిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మై గవ్ యాప్ ద్వారా ఈ పోటీలను నిర్వహిస్తున్నది.

06/20/2016 - 07:01

రాజమహేంద్రవరం, జూన్ 19: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ముద్రగడ దంపతుల ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం పదకొండో రోజూ కొనసాగింది. ఆదివారం ఆయనకు ఎకో పరీక్ష చేశారు. నివేదికలన్నీ బాగానే ఉన్నప్పటికీ ఆరోగ్యం మాత్రం ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

06/20/2016 - 07:00

సూళ్లూరుపేట, జూన్ 19: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధమైంది. ఈనెల 22న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం నుండి పిఎస్‌ఎల్‌వి-సి 34 రాకెట్ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) ఆదివారం షార్‌లో డాక్టర్ సురేశ్ అధ్యక్షతన జరిగింది.

Pages