S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/22/2016 - 02:00

విజయవాడ, జూన్ 21: ఈ నెల 22వ తేదిన విజయవాడలో జరగాల్సిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ఈ నెల 24కు వాయిదా పడింది. రాష్ట్ర మంత్రులతో పాటు ముఖ్యకార్యదర్శులు ఉద్యోగ బదీలల ప్రక్రియలో తలమునకలై ఉండడం కూడా కారణంగా కనిపిస్తోంది. 24న జరిగే సమావేశంలో ప్రధానంగా హైదారాబాద్ నుంచి 27వ తేదీ లోపు సచివాలయం నుండి ఏఏ శాఖలను తరలించాలనే అంశానికి సంబంధించి రూట్ మ్యాప్‌ను ఖరారు చేయనుంది.

06/22/2016 - 02:00

విజయవాడ, జూన్ 21: శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఉద్యోగులను పెద్దయెత్తున బదిలీ చేస్తూ ఎండోమెంట్స్ కమిషనర్ వైవి అనూరాధ ఉత్తర్వులు జారీ చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. దుర్గగుడి ఉద్యోగులపై బదిలీవేటు పడనున్నట్లు కొద్ది రోజుల నుండే పుకార్లు వెలువడుతున్నాయి.

06/22/2016 - 01:59

విజయవాడ, జూన్ 21: సింగల్ హాల్ట్‌తో విజయవాడ - హైదరాబాద్ మధ్య నడుస్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12795)కు ద్వితీయ విఘ్నం కలిగింది. రాజధాని ఉద్యోగుల తరలింపు కోసం రాష్ట్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా కేంద్రాన్ని ఒప్పించి తీసుకు వచ్చిన ఈ రైలు గత రాత్రి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు, సిఎం చంద్రబాబు జెండా ఊపి లాంభనంగా ప్రారంభించారు.

06/22/2016 - 01:58

ఖాజీపేట, జూన్ 21: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ యువతి కడప యువకుడితో చాటింగ్ చేస్తూ లక్షలు కాజేసింది. అమ్మాయి మోజులో పెద్దమొత్తంలో డబ్బు పోగొట్టుకున్న ఆ యువకుడు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా ఖాజీపేటలో సోమవారం రాత్రి జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన రమేష్(27) ఖాజీపేట బస్టాండులో టీ హోటల్ నిర్వహిస్తున్నాడు.

06/22/2016 - 01:56

అయినవిల్లి, జూన్ 21: ఈ ఖరీఫ్‌లో క్రాప్ హాలిడేకు వెళ్లడానికి సమాయత్తమవుతున్న తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతానికి చెందిన మండలాల జాబితాలో తాజాగా మరో మండలం చేరింది. ఇప్పటికే ముమ్మిడివరం, అల్లవరం మండలాల్లో రైతులు ఈ దిశగా ముందుకువెళ్తుండగా మంగళవారం అయినవిల్లి మండల రైతులు కూడా జతకలిశారు. మంగళవారం మండలంలోని మాగాం గ్రామంలో జరిగిన సమావేశంలో క్రాప్ హాలిడే ప్రకటించాలని రైతులు నిర్ణయించారు.

06/21/2016 - 18:09

విజయవాడ: పట్టణాలు, నగరాల్లో నివసించే ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు సంబంధిత అధికారులు చొరవ చూపాలని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన మున్సిపాలిటీలు, నగర పాలకసంస్థల్లో కార్యకలాపాలపై మంగళవారం సమీక్ష జరిపారు. మంచినీరు, పారిశుద్ధ్యం, రహదారుల నిర్వహణ వంటి సమస్యలకు మించి పట్టణ వాసులు పెద్దగా ఏమీ అడగరని, ఈ విషయాలను కూడా అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదన్నారు.

06/21/2016 - 18:08

హైదరాబాద్: గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను విడివిడిగా నిర్వహించాలని, ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు నగరంలోని ఎపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం వద్ద మంగళవారం ఆందోళన చేశారు. వీరికి బిసి సంఘం నేత, టిడిపి ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య మద్దతు పలికారు.

06/21/2016 - 18:08

అనంతపురం: నడిరోడ్డుపైనే ఓ నిండుగర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. హిందూపూర్‌లోని గురునాథ సర్కిల్ వద్ద రోడ్డుపై మంగళవారం ఆమె ప్రసవించింది.

06/21/2016 - 18:07

విశాఖ: అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన శ్రీమేధ కాలేజీ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఇక్కడి ఎంవిపి కాలనీలోని శ్రీమేధ కాలేజీలోకి విద్యార్థులు, తల్లిదండ్రులు మంగళవారం ప్రవేశించి ఫర్నిచర్‌ను, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారు. ఇంటర్మీడియట్, సిఎ కోచింగ్‌లకు తాము కట్టిన ఫీజులను తిరిగి చెల్లించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

06/21/2016 - 18:07

గుంటూరు: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రోగికి సహాయకురాలిగా వచ్చిన మహిళపై ఓ యువకుడు అత్యాచార యత్నం చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో మిగతా మహిళలు, ఆస్పత్రి సిబ్బంది వచ్చి ఆ యువకుడిని చితకబాదారు.

Pages