S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/21/2016 - 07:48

గుంటూరు, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల తరలింపుపై సర్వత్రా సందిగ్ధత నెలకొంది. ఈ నెల 29లోగా 4 వేల మంది ఉద్యోగులను తరలించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే భవనాల నిర్మాణాలు ఇంకా పూర్తికాలేదు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో సచివాలయ ప్రాంగణం బురదమయమైంది. ప్రహరీ గోడ పనులు ఇంకా పూర్తికాలేదు. 1, 5వ నెంబర్ భవనాలు మాత్రమే తుదిరూపు సంతరించుకుంటున్నాయి.

06/21/2016 - 07:25

భీమవరం, జూన్ 20: ఎన్ని ఇబ్బందులున్నా అన్నదాతల కళ్లలో వెలుగులు నింపడమే తమ ప్రభుత్వ ఆశయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇందులో భాగంగానే రైతులను రుణ విముక్తులను చేశామని, త్వరలో ఇ-క్రాప్ విధానం ప్రవేశపెడతామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఏరువాక పౌర్ణమి’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు.

06/21/2016 - 07:15

విజయవాడ, జూన్ 20: ఆంధ్రప్రదేశ్‌కు రవాణా సౌకర్యాన్ని విస్తరింపచేసేందుకు కొత్త రైలుమార్గాలను చేపట్టడంతోపాటు సింగిల్ రైలు మార్గాలను డబ్లింగ్ చేయటం, దశలవారీగా అన్ని రైల్వే స్టేషన్లను వౌలిక సదుపాయాల కల్పనతో ఆధునికీకరించేందుకు నడుం కట్టినట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సోమవారం రాత్రి మూడు బృహత్తర ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు.

06/21/2016 - 07:17

రాజమహేంద్రవరం, జూన్ 20: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మంగళవారం దీక్ష విరమించే అవకాశం ఉంది. తాను డిమాండు చేసినట్టుగా తుని కేసులకు సంబంధించి పదమూడు మందికి బెయిలు మంజూరు కావడంతో ఎట్టకేలకు ఆయన దీక్ష విరమించడానికి మార్గం సుగమమైంది. కాపు జెఎసి నేతలు జరిపిన చర్చల సందర్భంగా 13మంది బెయిలుపై విడుదలయ్యాక దీక్ష విరమిస్తానని ముద్రగడ పేర్కొన్న సంగతి విదితమే.

06/20/2016 - 18:15

గుంటూరు: తెనాలి సబ్ ట్రజరీ కార్యాలయంలో వరుణ్‌బాబు అనే ఉద్యోగి ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ దొంగిలించి 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను తన బంధువుల ఖాతాల్లోకి మళ్లించాడు. ట్రజరీలో రికార్డుల తనిఖీ సందర్భంగా ఈ బండారం బయటపడింది. నిధుల స్వాహాపై ట్రజరీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

06/20/2016 - 18:14

శ్రీకాకుళం: టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటించక పోవడంపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఆస్పత్రిని సందర్శించినపుడు వైద్యులు విధులకు గైర్హాజరు కావడాన్ని గమనించారు. వెంటనే వైద్యులకు ఫోన్లు చేసి రప్పించారు. ఈ ఒక్కరోజే ఇలా ఆలస్యమైందని వైద్యులు చెప్పగా, రోజూ చాలామంది డాక్టర్లు ఇష్టారాజ్యంగా వస్తుంటారని రోగులు మంత్రికి ఫిర్యాదు చేశారు.

06/20/2016 - 18:14

ఏలూరు: ఆకివీడులోని కార్పొరేషన్ బ్యాంకులో సుమారు 80 లక్షల రూపాయలు విలువచేసే బంగారు నగలు, కీలక పత్రాలు గల్లంతు కావడం సంచలనం సృష్టించింది. కొంతమంది ఖాతాదారులు తాము తనఖా పెట్టిన బంగారాన్ని విడిపించుకునేందుకు సోమవారం బ్యాంకుకు వెళ్లగా ఈ విషయం వెలుగు చూసింది. బంగారం తనఖాపై బ్యాంకు అధికారులు గతంలో భారీగా రుణాలిచ్చారు.

06/20/2016 - 18:14

గుంటూరు: తల్లి, కొడుకుల మృతదేహాలు బావిలో కనిపించడం ఆ గ్రామంలో విషాదాన్ని నింపింది. శావల్యాపురం మండలం శానంపూడి వద్ద సోమవారం ఉదయం తల్లి, కొడుకు బావిలోపడి మరణించి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇది హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

06/20/2016 - 18:13

కడప: కూలీలతో వెళుతున్న ఓ ట్రాక్టర్ రోడ్డు పక్కన పంటకాల్వలో పడడంతో ఇద్దరు మరణించగా పలువురు గాయపడ్డారు. సంబేపల్లి మండలం కొత్తపల్లి వద్ద సోమవారం ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆస్పత్రిలో చేర్పించగా నలుగురు కూలీల పరిస్థితి విషమంగా ఉంది. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సమచారం.

06/20/2016 - 18:13

కర్నూలు: నీళ్ల బకెట్‌లో పడిపోయి రెండేళ్ల బాలుడు మరణించిన ఘటన గడివేముల మండలం గ్రంధివేముల గ్రామంలో సోమవారం జరిగింది. కేరింతలు కొడుతూ సందడి చేసే రెండేళ్ల బాబు కనిపించకుండా పోవడంతో ఆ ఇంట్లో వారంతా అన్ని గదుల్లోనూ గాలించారు. చివరికి నీళ్ల బకెట్‌లో మునిగి బాలుడు మరణించి ఉండడాన్ని గమనించి వారంతా షాక్‌కు లోనయ్యారు.

Pages