ఆంధ్రప్రదేశ్‌

మరో మూడు ట్రిపుల్ ఐటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, జూన్ 20: రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలో రాష్ట్రంలో మరో మూడు ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని విశ్వవిద్యాలయ ఉప కులపతి విజయ్‌ప్రకాష్ తెలిపారు. కృష్ణా జిల్లా నూజివీడులో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ఈ విద్యా సంవత్సరం నుండి ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం రెండు, మూడురోజుల్లో ఉత్తర్వులు జారీ చేయనుందని చెప్పారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ నుండి నిధులు కూడా మంజూరయ్యాయన్నారు. వీటితో పాటు శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో కూడా ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందని తెలిపారు. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో ఈ ఏడాది నుండి ప్రవేశాలు కల్పించే అవకాశం ఉందన్నారు. విద్యారంగంలో శ్రీకాకుళం జిల్లా బాగా వెనుకబడి ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండి ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన విద్యార్థినీ, విద్యార్థులకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో తరగతులు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నూజివీడులో మరో రెండు వేల మంది విద్యార్థులు ఉండేందుకు అవసరమైన సదుపాయాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఏటా పదో తరగతి పరీక్షల్లో 5 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్నారని, వీరిలో ఒక శాతం మందికి ప్రపంచ స్థాయిలో సాంకేతిక విద్యను అందించటం ప్రధాన లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు కానున్న మూడు ట్రిపుల్ ఐటీలతో మొత్తం అయిదు ట్రిపుల్ ఐటీలు ఆర్జేయుకెటీ పరిధిలో ఉంటాయని విజయ్‌ప్రకాష్ వివరించారు.