S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/22/2016 - 17:28

ఒంగోలు: ఎన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో ధైర్యంగా రైతులకు రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీని వర్తింపజేశామన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు.

06/22/2016 - 16:11

విజయవాడ: రాజకీయ కోణంలో నిరాహార దీక్షలు చేస్తున్న ముద్రగడ పద్మనాభంకు కాపులను బీసీల్లో చేర్చడం ఇష్టం లేదని ఎపి హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాపులను బీసీల్లో చేర్చితే ఇక తన గురించి ఎవరూ పట్టించుకోరని ముద్రగడ అభద్రతతో ఉన్నారని అన్నారు. మంజునాథ కమిషన్ నివేదిక వచ్చేవరకైనా వేచిచూడాలన్న ఓపిక ఆయనలో లేదన్నారు.

06/22/2016 - 13:18

కాకినాడ: తుని విధ్వంసకాండలో అరెస్టులకు నిరసనగా గత 13 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బుధవారం మధ్యాహ్నం తన ఆందోళనను ముగించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కిర్లంపూడిలోని తన ఇంటికి చేరుకున్నాక ఆయనకు కాపుసంఘాల ఐకాస నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్షసాధింపు ధోరణితో వ్యవహరించిందని ఆరోపించారు.

06/22/2016 - 12:09

కాకినాడ: రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో 13 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి తన స్వస్థలమైన కిర్లంపూడికి బయలుదేరారు. తుని విధ్వంసకాండకు సంబంధించి అరెస్టు చేసిన వారందరినీ బెయిల్‌పై విడుదల చేయడంతో ఆయన కిర్లంపూడికి బయలుదేరారు.

06/22/2016 - 11:56

విజయవాడ: ఒకే సారి 20 ఉప గ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఇస్రో చరిత్రలో ఇదో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు.

06/22/2016 - 11:29

కడప : ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ మొదటి, రెండో సంవత్సర ఫలితాలను రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు కడపలో బుధవారం ఉదయం విడుదల చేశారు. మొదటి సంవత్సరంలో 3,38,256 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,58,132 మంది ఉత్తీర్ణత సాధించారు. 76.31 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి సంవత్సరం వృత్తి విద్యాకోర్సులకు సంబంధించి 11,507 మంది పరీక్ష రాయగా 7,062మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత శాతం 61.37గా నమోదైంది.

06/22/2016 - 06:30

హైదరాబాద్, జూన్ 21: తనపై ఆంధ్ర, తెలంగాణలో వివిధ పోలీసు స్టేషన్లలో ఉన్న కేసులను కొట్టివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సంబంధించిన రికార్డులను పరిశీలించిన తర్వాత చంద్రబాబు పిటిషన్‌లో పేర్కొన్న కేసుల ఎఫ్‌ఐఆర్‌లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

06/22/2016 - 06:29

హైదరాబాద్, జూన్ 21: కేంద్ర ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలిచేందుకు దాదాపు 11 కోట్ల రూపాయల వ్యయం చేసినట్లు ఏపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించడంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని వైకాపా డిమాండ్ చేసింది.

06/22/2016 - 06:28

హైదరాబాద్, జూన్ 21: హైదరాబాద్‌లోని ఏపిఎస్‌ఆర్టీసి బస్ భవన్ నుంచి ఉద్యోగులను విజయవాడకు తరలించినా, బస్‌భవన్‌లో కొన్ని శాఖలు పనిచేస్తాయని ఆర్టీసి ఎండి సాంబశివరావు హామీ ఇచ్చారని ఎంప్లారుూస్ యూనియన్ ఉపప్రధాన కార్యదర్శి పి దామోదరరావు తెలిపారు. లీగల్ సెల్‌తో పాటు స్ట్ఫా రిటైర్‌మెంట్ బెనిఫిట్ స్కీం, స్ట్ఫా బెన్వవిలెంట్ ట్రస్టు, పిఎఫ్ ట్రస్టుల ఉద్యోగులు బస్‌భవన్‌లో పనిచేస్తారన్నారు.

06/22/2016 - 06:27

హైదరాబాద్, జూన్ 21:సాక్షి ప్రసారాలను నిలిపివేయాలని ప్రభుత్వం, పోలీసులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ హైకోర్టుకు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సాక్షి ప్రసారాలను నిలిపివేసినట్టు సాక్షి మీడియా గ్రూప్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ ఎవి శేషసాయి విచారణ ప్రారంభించారు.

Pages