ఆంధ్రప్రదేశ్‌

ప్లాట్ల పంపిణీ ‘ప్రహసనం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 20: రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల పంపిణీ కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. వర్షం వల్ల వాయిదా వేస్తున్నట్లు సోమవారం మంత్రి నారాయణ, సిఆర్‌డిఎ అధికారులు ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేలపాడు గ్రామంలో ప్లాట్ల పంపిణీని ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం తుళ్లూరు సిఆర్‌డిఎ కార్యాలయం వద్ద భారీ బహిరంగ సభావేదికను సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అడుగడుగునా భద్రతా ప్రమాణాలను పాటించారు. అయితే వర్షంతో వేదికతో పాటు రైతులకు వేసిన కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇలావుంటే, 9.18 అభ్యంతరాల గడువును పొడిగించాల్సిందిగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు వాటాలు ఎలా పంచాలనే విషయమై రైతుల్లో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో సిఆర్‌డిఎ కార్యాలయం వద్దే నిరసన వ్యక్తం చేయాలని కొందరు రైతులు సిద్ధమైనట్లు తెలిసింది. ఈనేపథ్యంలోనే ప్రభుత్వం ప్లాట్ల పంపిణీని వాయిదా వేసినట్లు సమాచారం. గ్రామంలో ఇంకా 50 ఎకరాల మేర రాజధాని అవసరాలకు భూసమీకరణ జరపాల్సి ఉంది. అయితే రైతులు వ్యతిరేకించడంతో సేకరణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేలపాడుతో పాటు భూసమీకరణను నిరాకరించిన ఎర్రబాలెం, పెనుమాక, ఉండవల్లి, తదితర గ్రామాల్లో రెండున్నర వేల ఎకరాలు సేకరణ జరిపితేనే సింగపూర్ మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంది. రాజధాని ప్రతిపాదిత 29 గ్రామాల్లో 9 భావన నగరాల (కానె్సప్ట్ సిటీస్)ను సింగపూర్ మాస్టర్‌ప్లాన్ సూచించింది. పూర్తిస్థాయిలో భూసేకరణ జరిపితేనే రాజధానికి ఓ స్వరూపం వస్తుంది. కొన్ని గ్రామాల రైతులు వ్యతిరేకిస్తుండటంతో ఇప్పుడే లేఅవుట్లు వేయడం కష్టసాధ్యమని అధికారులు చెపుతున్నారు. నేలపాడు మినహా మిగిలిన గ్రామాల్లో రైతుల ప్లాట్ల పంపిణీ కార్యక్రమం ప్రభుత్వానికి తలనొప్పిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా ప్రకటించినట్లు ఈ నెల 20 నుంచి వచ్చే నెల 10లోగా ప్లాట్ల పంపిణీని పూర్తిచేస్తామని ప్రకటించినప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. అసైన్డ్, లంక, దేవాదాయ భూములకు సంబంధించి కచ్చితమైన లెక్కలు తేలలేదు.